హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అండర్‌పాస్‌లో నీరు నిలిచి ఉండటంతో.. అది గమనించని ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్‌పాస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నీరు నిలిచిపోవడంతో వారి ఎస్‌యూవీ అందులో ఇరుక్కుపోయింది. దీంతో వారు బయటకు రాలేక కారులోనే ఉండటంతో ఊపిరాడక మరణించారని పోలీసులు శనివారం తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాజాగా.. మల్కాజిగిరి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను అభ్యర్థులను వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేయగా.. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కు పేరును గులాబీ బీస్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు.
దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా పాకుతుంది. మళ్లీ కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో.. మహారాష్ట్రలో కొత్తగా 87 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. కాగా.. ముంబైలో 19 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పూణె, సాంగ్లీ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇదిలా ఉంటే.. నిన్న రాష్ట్రంలో 37 మందికి కరోనా సోకింది. మార్చి 2020 నుండి…
రెండేళ్లకు ముందు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మరి ఇప్పుడు కొత్త వేరియంట్ లతో భయపెడుతుంది. పలు రకాల వేరియంట్లతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మొదటగా కేరళలలో మొదలైన కొత్త వేరియంట్ జేఎన్ 1.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. తప్పనిసరిగా కొవిడ్ ఆంక్షలు పాటించాలని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తు్న్నాయి.
విరాట్ కోహ్లీ వన్డే కెరీర్ లో మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను బ్రేక్ చేయనున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ 49 సెంచరీలు చేశాడు. సచిన్ 463 మ్యాచ్‌ల్లో 49 సెంచరీలు చేయగా.. కోహ్లీ మాత్రం కేవలం 285 మ్యాచుల్లోనే 48 శతకాలు బాదాడు. అయితే ఈ ప్రపంచకప్ టోర్నీలోనే ఆ రికార్డును బ్రేక్ చేయాలని కోహ్లీ చూస్తున్నాడు.