Akkineni Naga Chaitanya:అక్కినేని నట వారసుడు నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జోష్ సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన చై.. నిదానంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వస్తున్నాడు. ఈ మధ్యనే దూత వెబ్ సిరీస్ తో సిజిటల్ ఎంట్రీ గ్రాండ్ గా ఇచ్చిన చై.. ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా మారాడు. కెరీర్ ప్రారంభించి ఎన్నో ఏళ్లు అవుతున్నా చై పాన్ ఇండియా లెవెల్ ఇంకా మొదలుపెట్టలేదు. ఇక ఆ సమయం వచ్చేసింది. తండేల్ సినిమాతో పాన్ ఇండియా రేసు లో అడుగుపెడుతున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చై సరసన సాయిపల్లవి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఉత్తరాంధ్ర జిల్లాలకు కొందరి మత్స్యకారుల నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు చందూ మొండేటి. ఇక ఈ సినిమాలో ఓ మత్స్యకారుడి పాత్రలో చై కనిపించనున్నాడు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఈ సినిమాలోని చై లుక్ నెట్టింట వైరల్ గా మారింది. పాత్ర కోసం ఎంత కష్టమైనభరించే చై.. ఈ మత్స్యకారుడి పాత్ర కోసం డీ గ్లామరస్ బాయ్ గా మారిపోయాడు. ఊరమాస్ గెటప్ లో దర్శనమిచ్చాడు. ఫుల్ గడ్డం, మాసిన షర్ట్, నుదుటన బారుగా బొట్టు పెట్టుకొని అసలు ఊహించని గెటప్ లో కనిపించాడు. సడెన్ గా చై ను ఈ లుక్ లో చూస్తే పుష్ప గుర్తుకురాక మానడు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా కోసం చై బాగా కష్టపడుతున్నాడు అని ఈ ఫోటో చూస్తుంటేనే తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అక్కినేని కుర్రాడు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.