YouTube: యూట్యూట్ లో తప్పుడు వార్తల ప్రసారం.. 8 ఛానళ్లపై కేంద్రం వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముందస్తు లోక్‌సభ ఎన్నికలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిషేధించడం వంటి తప్పుడు వార్తలను ప్రసారం చేసినందుకు గాను 8 యూట్యూబ్ ఛానళ్లను (23 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు) కేంద్ర ప్రభుత్వం నిషేదిస్తున్నట్లు తెలిపింది. ఆ ఛానళ్లలో యహాన్ సచ్ దేఖో, క్యాపిటల్ టీవీ, కేపీఎస్ న్యూస్, సర్కారీ వ్లాగ్, ఎర్న్ టెక్ ఇండియా, వరల్డ్ బెస్ట్ న్యూస్ ఛానల్, ఎస్పీఎన్ 9 న్యూస్, ఎడ్యుకేషనల్ దోస్త్ ఇందులో ఉన్నాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మెంబర్స్, ఆ ఛానళ్లకు సంబంధిం వివరాలను సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: PK MB: మహేశ్ బాబుకి స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన పవర్ స్టార్…
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
వరల్డ్ బెస్ట్ న్యూస్ భారత సైన్యాన్ని కించపరుస్తూ.. సైన్యాన్ని తక్కవ చేసి చూపించారని అధికారులు వెల్లడించారు. ఇక, ఎడ్యుకేషనల్ దోస్త్ అనే ఛానల్ ప్రభుత్వ పథకాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మెంబర్స్ నిర్ధారించారు. SPN9 ఛానల్ రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో పాటు పలువురికి సంబంధించిన ఫేక్ వార్తలను ప్రచురించింది.
Read Also: Jangon Crime: కూతురి వేలు కొరకిన అల్లుడు.. ఇంట్లోనే సమాధి కట్టిన మామ..!
అదేవిధంగా సర్కారీ వ్లాగ్ ఛానల్ ప్రభుత్వ పథకాలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక, కేపీఎస్ న్యూస్ అనే ఛానల్ రూ.20కి వంటగ్యాస్ సిలిండర్లు, లీటరుకు రూ.15కు పెట్రోలు లభిస్తుందంటూ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, ఆర్డర్లు, నిర్ణయాలకు సంబంధించి ఫేక్ న్యూస్ ప్రచారం చేసిందని అధికారుల విచారణలో వెల్లడైంది.
Read Also: Prabhas: 50 రోజుల్లో రికార్డులని చెల్లాచెదురు చేయడానికి ‘డైనోసర్’ వస్తుంది
అయితే, క్యాపిటల్ టీవీ ఛానల్ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన అమలుకు సంబంధించిన ఉత్తర్వుల గురించి అసత్యపు న్యూస్ ను ప్రచారం చేసిందని తేలింది. యహన్ సచ్ దేఖో ఛానల్ ఎన్నికల సంఘం, భారత ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన ఫేక్ న్యూస్ ను టెలికాస్ట్ చేసిందని అధికారులు గుర్తించారు. చివరగా ఎర్న్ ఇండియా టెక్ ఛానల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇతర సేవలకు సంబంధించి నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారుల ఎంక్వైరీలో తేలింది.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!