భారత సైన్యం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ తీవ్రంగా కృంగిపోయింది. రోజురోజుకూ ఓటమి వైపు పయనిస్తున్న పాకిస్థాన్ సైన్యం.. ఇప్పుడు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి అబద్ధాలను ప్రచారం చేయడం ప్రారంభించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్థాన్ సైన్యం కొత్త అబద్ధాలను పుట్టిస్తోంది. అయితే.. శనివారం మరో కొత్త దుష్ర్పాచారం చేసింది. ఢిల్లీ విమానాశ్రయంపై క్షిపణితో విజయవంతంగా దాడి చేశామని, ఈ దాడిలో విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైందని పాకిస్థాన్ పేర్కొంది.
రాష్ట్రపతి భవన్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో అత్యున్నత కార్యక్రమాలు నిర్వహించే ప్రత్యేక స్థలం ఇది. ప్రధాని ప్రమాణ స్వీకారం, విదేశీ దేశాధినేతల సమావేశాలు, గౌరవ విందులు లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. కాగా నేడు (బుధవారం 12 ఫిబ్రవరి).. రాష్ట్రపతి భవన్ భద్రత విభాగంలో పీఎస్ఓ (Personal Security Officer) హోదాలో పని చేస్తున్న పూనమ్ గుప్తా వివాహం ఇక్కడ ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించారు.
ముందస్తు లోక్‌సభ ఎన్నికలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిషేధించడం వంటి తప్పుడు వార్తలను ప్రసారం చేసినందుకు గాను 8 యూట్యూబ్ ఛానళ్లను (23 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు) కేంద్ర ప్రభుత్వం నిషేదిస్తున్నట్లు తెలిపింది.
Demonetised Currency Notes Exchange: ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రకటించిన తర్వాత.. ఏ బ్యాంకు దగ్గర చూసినా భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి.. పాత నోట్లు మార్చుకోవడానికి నానా కష్టాలు పడ్డారు ప్రజలు.. కొన్ని రోజులు చిల్లర కష్టాలు కూడా వేధించాయి.. అయితే, రద్దు చేయబడిన పాత నోట్లు మార్చుకోవడానికి మరో అవకాశం ఇచ్చారంటూ పలు మార్లు ఫేక్ న్యూస్ వైరల్‌గా మారిన సందర్భాలు లేకపోలేదు.. ఇక, ఈ మధ్య రద్దు చేసిన…