Telangana: లోక్‌సభ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సోమవారం లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే.. వేసవి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు ఓటువేసేందుకు ముందుకు వచ్చారు. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఓటర్లు ఉత్సాహంగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Andhra Pradesh Election 2024: సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఏపీ ఎలెక్షన్స్.. ప్రతి సీనూ క్లైమాక్సే!
Also Read
అయితే.. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరి 76.78 శాతం, అత్యల్పంగా.. హైదరాబాద్ 48.48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో రాష్ట్రంలో 62.77 శాతం ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గంలో 50.34% ఓటింగ్ నమోదైంది.
DC vs LSG: లక్నో ముందు భారీ లక్ష్యం.. ఢిల్లీ స్కోరు ఎంతంటే..?
17 నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్ శాతం..
ఆదిలాబాద్ 74.03 శాతం, పెద్దపల్లి 67.87, కరీంనగర్ 72.54 శాతం, నిజామాబాద్ 71.92, జహీరాబాద్ 74.63, మెదక్ 75.09, మల్కాజ్‌గిరి 50.78, సికింద్రాబాద్ 49.04, చేవెళ్ల 56.50, మహబూబ్‌నగర్ 72.43, నాగర్‌కర్నూల్ 69.46 శాతం, భువనగిరి 76.78 శాతం, నల్గొండ 74.02, హైదరాబాద్ 48.48 శాతం, వరంగల్ 68.86 శాతం, మహబూబాబాద్ 71.85, ఖమ్మం 76.09 శాతం పోలింగ్ నమోదు.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!