Election Commission: మూడో దశలో నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా మూడో దశ పోలింగ్ ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఓటు వేశారు. మరోవైపు వడదెబ్బ తగలకుండా ఈసీకి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు కూడా చేసింది. ఇదిలా ఉంటే మూడో దశ ఎన్నికల్లో భాగంగా 61.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: DC vs RR: హాఫ్ సెంచరీలతో మెరిసిన మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్.. ఆర్ఆర్ టార్గెట్ 222..
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. పశ్చిమబెంగాల్లో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా అన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాత్రి 8 గంటలకు 61.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
అస్సాంలో అత్యధికంగా 74.86శాతం పోలింగ్ నమోదు కాగా.. పశ్చిమబెంగాల్లో 73.93 శాతం ఓటింగ్ నమోదైంది. మహారాష్ట్రలో మాత్రం అత్యల్పంగా 53.63శాతం, బిహార్‌లో 56.01శాతం పోలింగ్ రికార్డయ్యింది. సాయంత్రం 6 గంటల వరకే పోలింగ్ సమయం ఉండగా.. క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తుండటంతో కొన్నిచోట్ల ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయింది. రాత్రి 8గంటల వరకు పోలింగ్ నడిచింది.
ఇది కూడా చదవండి: Liquor Stock : ఎక్సైజ్ శాఖకు టీఎస్ వైన్ డీలర్స్ అసోసియేషన్ లేఖ
మూడో విడతలో మొత్తంగా 17.24 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 8.39 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వీరికోసం 1.85 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుజరాత్ 25, కర్ణాటక 14, మహారాష్ట్ర 11, ఉత్తర్‌ప్రదేశ్ 10, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్‌గఢ్ 7, బిహార్ 5, పశ్చిమబెంగాల్ 4, అస్సాం 4, గోవా 2, దాద్రానగర్ హవేలీ, దమణ్ దీవ్ 2 స్థానాల్లో పోలింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ నియోజకవర్గం ఎన్నిక మే 25కి వాయిదా పడింది.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉదయం అహ్మదాబాద్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ఈరోజు ఓటు వేశారు. రాత్రి 8 గంటల వరకు 61.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: West Nile fever: కేరళలో ‘‘వెస్ట్ నైలు ఫీవర్’’ కలకలం.. 5 కేసులు నమోదు.. లక్షణాలు ఇవే..
మహారాష్ట్రలో 48 స్థానాల్లో 11 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బారామతిలో పవార్ వర్సెస్ పవార్ మధ్య పోటీ నెలకొంది. శరద పవార్ కుమార్తె సుప్రియా అజిత్ పవార్ సతీమణి పోటీ పడ్డారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

తాజావార్తలు
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్‌తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్‌రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!