సెక్స్ టేపుల కుంభకోణంలో ఇండియా నుంచి జర్మనీ వెళ్లిపోయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈరోజు తెల్లవారుజామున ఇండియాకు వచ్చాడు. బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అక్కడే అరెస్ట్ చేశారు. కాగా.. ప్రజ్వల్ రేవణ్ణను కాసేపటి క్రితం సిట్ తమ ఆధీనంలోకి తీసుకుని సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో.. ప్రజ్వల్ రేవణ్ణను కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి 6 రోజుల పాటు ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు విచారించనున్నారు. జూన్ 6 వరకు సిట్ కస్టడీలో ఉండనున్నారు. ముందుగా ప్రజ్వల్ రేవణ్ణను విచారించేందుకు 14 రోజుల కస్టడీని సిట్ కోరింది. అందులో భాగంగా.. అతనిపై సెక్స్ టేపుల కుంభకోణంకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశముంది. మరోవైపు.. ప్రజ్వల్ రేవణ్ణకు “లైంగిక పటుత్వ పరీక్ష” నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Hanging From Building: గాలిలో చిక్కుకున్న కార్మికులు.. వీడియో వైరల్..
నెల క్రితం ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా చెప్పబడుతున్న అనేక సెక్స్ వీడియోలు హసన్ జిల్లాతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ.. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజ్వల్ ఇండియా నుంచి జర్మనీ వెళ్లిపోయారు. తాజాగా ఈ రోజు తెల్లవారు జామున ఇండియాకు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం సిట్ కస్టడీలో ఉన్నాడు.