ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల వాడకం ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. కొందరు అయితే 2-3 కూడా వాడుతున్నారు. ఈ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని.. మొబైల్ కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. 2024లో చాలా స్మార్ట్‌ఫోన్‌లను పలు కంపెనీలు తీసుకొచ్చాయి. ఇక కొత్త ఏడాది 2025లో కూడా ప్రముఖ మొబైల్ కంపెనీలు సరికొత్త ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. 2025లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లు ఏంటో ఓసారి చూద్దాం.
యాపిల్ కంపెనీ 2025 చివరలో ఐఫోన్ 17ను లాంచ్ చేయనుంది. ఐఫోన్ 17 అప్‌గ్రేడ్ చేసిన ఏ సిరీస్ ప్రాసెసర్‌తో రానుంది. అంతేకాదు
కెమెరా, బ్యాటరీని ఎక్కువ సామర్థ్యంతో ఇవ్వనున్నారు. ఇందులో మరిన్ని ఏఐ ఫీచర్‌లను అందించే అవకాశం ఉంది. ఎప్పటిలానే అక్టోబర్ నెలలో ఐఫోన్ 17 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ 2025 జనవరిలో విడుదల కానుంది. ఈ సిరీస్లో గెలాక్సీ ఎస్ 25, గెలాక్సీ ఎస్ 25 ప్లస్, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా మోడల్‌లు ఉంటాయి. ఇందులో స్నాప్ డ్రాగన్ లేదా ఎక్సినోస్ చిప్‌సెట్ ఉండనుంది. ఈ ఫోన్ వన్ యూఐ 7తో రానుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: U19 Asia Cup 2024: మెరిసిన తెలంగాణ అమ్మాయి.. ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్!
వన్‌ప్లస్ 13 సిరీస్ జనవరి ఆరంభంలోనే లాంచ్ కానుంది. వన్‌ప్లస్ 13లో రెండు మోడల్‌లు రానున్నాయి. వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 13 ఆర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్స్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్తో రానున్నాయి. వన్‌ప్లస్ 13తో పాటు బడ్స్ ప్రో 3లో కొత్త కలర్ ఆప్షన్‌ను రిలీజ్ కానుంది.