ప్రయత్నమే మొదటి విజయం. నిరాశ పడకుండా ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించొచ్చు. జాబ్ సాధించడం మీ కలనా? అయితే ఈ జాబ్స్ ను మిస్ చేసుకోకండి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా మొత్తం 558 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్పెషలిస్ట్ గ్రేడ్ II (సీనియర్ స్కేల్) కింద 155 పోస్టులను, స్పెషలిస్ట్ గ్రేడ్ 2 (జూనియర్ స్కేల్) కింద 403 పోస్టులను భర్తీ చేస్తారు.
Also Read:Sumaya Reddy: వైసీపీ నేతతో వీడియో వైరల్.. హీరోయిన్ ఏమందంటే?
అభ్యర్థులు సంబంధిత రంగంలో MD/ MS/ MCH/ DM/ DA/ MSc/ DPM తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు. ESIC సూచించిన నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్ 12, 7వ CPC ప్రకారం రూ. 78,800 ప్రారంభ జీతం అందిస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 500గా నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 26 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.