Boy Falls into Borewell: మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన జరిగింది. సోమవారం 200 అడుగుల లోతున్న బోరుబావిలో పడి 5 ఏళ్ల బాలుడు మరణించాడని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) తెలిపింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి పవన్ గౌర్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని అహ్మద్‌నగర్ జిల్లా కోపర్డి గ్రామంలోని పొలంలో ఉన్న బోరుబావిలో బాలుడు పడిపోయాడు. బోరుబావిలో చిక్కుకున్న బాలుడిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌లోని 5వ బెటాలియన్‌ను రంగంలోకి దించారు. అయితే బాలుడిని రక్షించేందుకు చర్యలు ప్రారంభించక ముందే ఆ బాలుడు స్పందించడం మానేశాడు. ఆ బాలుడి మృతదేహాన్ని తెల్లవారుజామున 3గంటలకు పైకి తీసుకొచ్చారు. బాలుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.
Read Also: Iran: వేలాది మంది నిరసనకారులకు ఇరాన్ క్షమాభిక్ష
ఇటీవల రాష్ట్రంలోని బుర్హాన్‌పూర్ జిల్లా నుంచి వారి కుటుంబం పొట్టకూటి కోసం కోపర్డి గ్రామానికి వలస వచ్చింది. వారు వృత్తి రీత్యా చెరుకు కోత వృత్తిలో ఉన్నారు. ఎప్పటిలాగే వారు తమ పిల్లాడిని తీసుకుని చెరుకు కోసేందుకు వెళ్లారు. వారు పనులు చేసుండగా.. పొలానికి సమీపంలో ఆ ఐదేళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. కాసేపటి తర్వాత ఆ బాలుడు కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు తమ కుమారుడి కోసం వెతికారు. ఎక్కడా కనిపించలేదు. దగ్గరలో ఉన్న బోరుబావిలో గమనించగా.. తమ కొడుకు అందులో పడినట్లు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాలుడిని రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌లోని 5వ బెటాలియన్‌ను పిలిపించారు. కానీ బాలుడి ప్రాణాలు దక్కకుండా పోయాయి.