Road Accident: ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు మీద వెళ్లే ప్రయాణీకుల మూలంగా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటే.. డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్ ఇతరత్రా కారణాలతోనూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఏటా మరణించే వారిలో 3వ వంతు ప్రమాదాల మూలంగా చనిపోతున్న వారే ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్ట రాజధాని లక్నోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మరణించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని ఢీ కొట్టిన స్కార్పియో వాహనం స్కూటీని 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Amit Shah Visit To Moreh: భారత- మయన్మార్ సరిహద్దులో అమిత్‌షా.. మోరేలో పర్యటన..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ ఎస్యూవీ కారు స్కూటీని బలంగా ఢీ కొట్టింది. ఢీ కొట్టిన అనంతరం అలాగే 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు కింద ఓ కుటుంబం ఇరుక్కుపోయింది. అనంతరం కారు ఓ చెట్టును ఢీ కొట్టి ఆగిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు కింద ఇరుక్కుపోయినవారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా మృతులు సీతాపూర్‌కు చెందిన రామ్‌సింగ్ (35), అతని భార్య, ఇద్దరు పిల్లలుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.