Train Accident: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో గూడ్స్ రైలును రైలు ఢీ.. నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐరోపా దేశమైన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ నుంచి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఈరోజు తెల్లవారుజామున గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 23 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ సంఘటన ప్రాగ్‌కు తూర్పున 100 కిలోమీటర్లు (62 మైళ్ళు) దూరంలో ఉన్న పార్దుబిస్ నగరంలో జరిగిందని ఆ దేశ మంత్రి విట్ రాకుసన్ తెలిపారు. ప్యాసింజర్ రైలు ప్రైవేట్ రెజియోజెట్ కంపెనీకి చెందినదని రకుసన్ చెప్పారు. దీంతో తూర్పు భాగం గుండా ఒక ప్రధాన ట్రాక్ మూసివేయవలసి వచ్చిందన్నారు.
Read Also: Aranmanai 4 OTT: ఓటీటీలో తమన్నా, రాశీఖన్నా ‘బాక్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
కాగా, ఈ రైలులో 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.. వీరిలో చాలా మంది విదేశీయులు.. ప్రైవేట్ రెజియోజెట్ కంపెనీ నిర్వహించే ఈ రైలు స్లోవేకియా సరిహద్దుకు దగ్గరగా ఉన్న పశ్చిమ ఉక్రేనియన్ నగరమైన చాప్‌కు వెళ్తుండగా.. పార్దుబిస్ మెయిన్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెక్ రిపబ్లిక్ దేశ రవాణా శాఖ మంత్రి మార్టిన్ కుప్కా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ కొనసాగుతుందన్నారు. ఇక, గూడ్స్ రైలు కాల్షియం కార్బైడ్‌ను తీసుకువెళుతుందని స్థానిక అగ్నిమాపక శాఖ ప్రతినిధి వెందుల హోరకోవా పేర్కొన్నారు. ఈ దుర్ఘటనను పెను విషాదంగా అభివర్ణించిన ఆయన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తాజావార్తలు
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?