Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR asked SS Rajamouli about Varanasi Release Date: మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఫాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో ఆసక్తికరమైన సంభాషణ జరిపారు. ఇక్కడికి వచ్చిన అందరికీ థాంక్స్, జాగ్రతగా ఇంటికి వెళ్లండి అని అభిమానులను టైగర్ కోరారు. త్వరలోనే ‘డ్రాగన్’తో మీ ముందుకు వస్తానని చెప్పారు. నేను డ్రాగన్ అప్డేట్ ఇచ్చేముందు.. ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన అప్డేట్ జక్కన్న ఇస్తాడేమో అడుగుదాం అన్నారు. ‘నేను అప్డేట్ ఇచ్చే ముందు.. ఈ మహానుభావుడు (రాజమౌళి) వారణాసి గురించి ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో చూద్దాం’ అని టైగర్ అన్నారు. ‘వారణాసి ఏప్రిల్ 7న వస్తుందా?’ అని ఎన్టీఆర్ ప్రశ్నించారు. దీనికి రాజమౌళి ‘తప్పకుండా’ అంటూ సమాధానం ఇచ్చారు.
Also Read
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
- Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
- Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
దీంతో ఎన్టీఆర్ వెంటనే ఏప్రిల్ 7న వారణాసి వస్తుంది.. అందరూ రెడీగా ఉండండి అంటూ ప్రకటించారు. దీంతో ఈవెంట్లో ఒక్కసారిగా అభిమానులు సందడి చేశారు. ఇప్పటివరకు వారణాసి విడుదల తేదీపై ప్రచారం జరుగుతుండగా.. తాజాగా రాజమౌళి సమక్షంలో ఎన్టీఆర్ చేసిన ఈ ప్రకటనతో రిలీజ్ డేట్‌పై మరింత స్పష్టత వచ్చినట్లైంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వారణాసిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?