Earthquake: గుజరాత్లో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.రాజ్‌కోట్‌కు 270 కిలోమీటర్ల దూరంలో భూమికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మధ్యాహ్నం 3:21 గంటలకు భూకంప కేంద్రం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్ చేసింది.
Read Also: Congress: మరో యాత్రకు కాంగ్రెస్ శ్రీకారం.. ఈ సారి తూర్పు నుంచి పడమరకు..
ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గత వారం, గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో రెండు రోజుల్లో మూడు చిన్నపాటి ప్రకంపనలు నమోదయ్యాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ISR) అధికారి ఒకరు చెప్పినట్లు తెలిసింది. భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.