Bharat Jodo Yatra: 3వేల కిలోమీటర్లు పూర్తి.. నేడు యూపీలో పునఃప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తొమ్మిది రోజుల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్‌లో నేడు పునఃప్రారంభం కానుంది. 110 రోజులకు పైగా సాగిన యాత్రలో ఇప్పటివరకు 3వేల కిలోమీటర్లకు చేరుకుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది. ఇది జమ్మూ కాశ్మీర్లో ముగుస్తుంది.
భారతదేశ చరిత్రలో ఏ భారతీయ రాజకీయ నాయకుడు చేయని.. కాలినడకన సాగిన సుదీర్ఘ పాదయాత్ర ఇదేనని కాంగ్రెస్ పేర్కొంది. జనవరి 26న శ్రీనగర్‌లో ముగిసే యాత్ర తర్వాత, యాత్ర సందేశాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో’ ప్రచారాన్ని ప్రారంభించనుంది.కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి దేశవ్యాప్తంగా ‘హాత్ సే హాత్ జోడో’ ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను సోదరి, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించారు.
Also Read
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
Siddeshwar Swami: జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి కన్నుమూత.. ప్రధాని సంతాపం
భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ రెండు నెలల పాటు ‘హత్ సే హాత్ జోడో ప్రచారాన్ని’ ప్రారంభిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రియాంక గాంధీ వాద్రా ప్రతిచోటా మహిళా సభ్యులతో పాదయాత్రలు, ర్యాలీలకు నాయకత్వం వహిస్తారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ‘భారత్ జోడో యాత్ర’ సందేశాన్ని వ్యాప్తి చేస్తారన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రజలపై, ముఖ్యంగా మధ్యతరగతిపై దాని ప్రభావంపై దృష్టి సారించి, మార్చిలో ప్రియాంక గాంధీ వాద్రా మహిళా కార్యకర్తలతో కవాతులకు నాయకత్వం వహిస్తారని సమాచారం. మహిళలకు సంబంధించిన ఇతర అంశాలు కూడా ప్రధాన ర్యాలీ పాయింట్‌గా ఉంటాయి.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!