Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
- మే జీతం నుంచే 1.5% EHS కోత అమలు
- భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒక్కరికే కోత
- డబుల్ కటింగ్ అయితే రీఫండ్ హామీ
- ఉద్యోగుల ఆరోగ్య నిధికి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం అమలవుతున్న ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (EHS) నిధి సమకూర్పుపై రాష్ట్ర ఆర్థిక శాఖ సరికొత్త ఉత్తర్వులను జారీ చేసింది. జూన్ 29, 2026 నాటి అధికారిక జీవో (G.O.Ms.No.79) ప్రకారం ఇకపై ప్రతి ఉద్యోగి మూల వేతనం (Basic Pay) లేదా పెన్షనర్ల మూల పింఛను (Basic Pension) నుండి ప్రతి నెలా 1.5 శాతం మొత్తాన్ని ఈ ఈహెచ్ఎస్ హెల్త్ ఫండ్‌కు విరాళంగా కట్ చేయనున్నారు. మే 2026 నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల (జూన్‌లో చెల్లించేవి) నుంచే ఈ కోత ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఒకే ఇంట్లో ఇద్దరు ఉద్యోగులుంటే ఎలా? డబుల్ కటింగ్ పడకుండా రూల్స్
ఈ నిధుల కోత విధానంలో ఉద్యోగులపై అదనపు భారం పడకుండా, ఎక్కడా డబుల్ కటింగ్ జరగకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పుడు, లేదా వారిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మరొకరు ప్రభుత్వ పెన్షనర్‌గా ఉన్నప్పుడు కేవలం ఒక్కరి జీతం నుండి మాత్రమే ఈ మొత్తాన్ని మినహాయిస్తారు. అలాగే ఒకే వ్యక్తి ప్రభుత్వ సర్వీస్ పెన్షన్ , ఫ్యామిలీ పెన్షన్.. ఇలా రెండు పింఛన్లు పొందుతున్నప్పుడు కూడా ఒకే ఒక కోతకు నిబంధనలను పరిమితం చేశారు. ఇలాంటి సందర్భాలలో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (DDOs) ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్-హెచ్ఆర్ఎమ్ఎస్ (IFMIS-HRMS) సాఫ్ట్വേర్ సిస్టమ్‌లో పక్కాగా నమోదు చేసి, పొరపాటున కూడా రెండోసారి కటింగ్ అవ్వకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ఇప్పటికే ఎవరికైనా ఇలా అదనంగా డబ్బులు కట్ అయి ఉంటే, ఆ మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత సమర్థవంతంగా నడిపించేందుకు గానూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) చైర్‌పర్సన్‌గా ఒక ప్రత్యేక బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో కూడిన ‘న్యూ ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్’ (EHCT)ని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ బోర్డులో ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఇచ్చే 1.5 శాతం వాటా నిధికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు మ్యాచింగ్ గ్రాంట్‌ను ఈ హెల్త్ కేర్ ట్రస్ట్‌కు జమ చేయనుంది. సేకరించిన నిధులన్నింటినీ ప్రత్యేక అకౌంట్ హెడ్ ద్వారా మెడికల్ అవసరాల నిమిత్తం భద్రపరుస్తారు.
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!