Vijayawada Fire Accident: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం.. 300 ద్విచక్ర వాహనాలు దగ్ధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Broke Out in Vijayawada TVS Showroom: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున కేపీ నగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షోరూమ్‌తో పాటు గోదాంలో ఉన్న దాదాపు మూడు వందల ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. మూడు ఫైరింజన్లు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
విజయవాడలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో టీవీఎస్ షోరూం ఉంది. ఈరోజు తెల్లవారుజామున షోరూంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే ఆ మంటలు గోదాంకూ విస్తరించాయి. ఇది గమనించిన సెక్యూరిటీ.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మూడు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రీఫ్యాబ్రిక్ పద్ధతిలో నిర్మించిన షోరూం కావడంతో మంటలు వేగంగా విస్తరించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గోదాంలో సాధారణ టూ వీలర్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయని పేర్కొన్నారు.
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
పోలీసులు టీవీఎస్ షోరూం చేరుకుని విచారణ చేపట్టారు. పెట్రోల్ వాహనాలను ఉంచే గోదాం సమీపంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఉంచడం, వాటిని ఛార్జింగ్ పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విజయవాడ సహా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం. దాంతో వందల సంఖ్యలో వాహనాలు ఇక్కడే ఉంచుతారు. షోరూంతో పాటు సర్వీస్ సెంటర్‌లను కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఒకే ప్రాంగణంలో షోరూం, గోదాం, సర్వీస్ సెంటర్ ఉండటంతో వందల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి. ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!