Fire Broke Out in Vijayawada TVS Showroom: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున కేపీ నగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షోరూమ్‌తో పాటు గోదాంలో ఉన్న దాదాపు మూడు వందల ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. మూడు ఫైరింజన్లు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.…