3 Floor Building collapse in AP: ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్ద దోర్నాలలో మూడు అంతస్థుల భవనం కుప్పకూలింది. శ్రీశైలం రోడ్డులో అందరూ చూస్తుండగానే.. వాసవి లాడ్జి భవనం కూలిపోయింది. వాసవి లాడ్జి భవనం పక్కనే మరో భవన నిర్మాణం కోసం పునాది గుంతలు తీయటంతో ఈ ఘటన చోటుచేయుకుంది. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పెద్ద దోర్నాలలో వాసవి లాడ్జి భవనం మూడంతస్థులలో ఉంది. ఈ భవనంకు పక్కనే మరో భవన నిర్మాణం ఇటీవల ఆరంభం అయింది. భవన నిర్మాణం కోసం పునాది గుంతలు తీయటంతో.. వాసవి లాడ్జి భవనంకు పగుళ్లు ఏర్పడ్డాయి. పగుళ్లతో భవనం ఓ పక్కకు ఒరగడంతో.. సిబ్బంది హుటాహుటిన భవనంను ఖాళీ చేయించారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.