గుండె పోటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా కనిపించిన వారు క్షణాల్లోనే విలవిల్లాడుతూ కుప్పకూలుతున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే తుది శ్వాస విడుస్తున్నారు. తాజాగా నాగోల్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ 25 ఏళ్ల యువకుడు షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు సీపీఆర్ చేసిన ప్రయోజనం లేకుండా…