సినిమా కంటెంట్ బాగుండి కొన్ని సినిమా లు హిట్ టాక్ సొంతం చేసుకున్నా కూడా వసూళ్లు వచ్చేలా అయితే చేసుకోలేక పోతున్నాయి.కానీ ‘2018’ సినిమా విషయం లో ఇందుకు భిన్నం గా జరిగిందని చెప్పవచ్చు… ఓటీటీ లో విడుదల అవ్వడానికి ముందు ఈ సినిమా థియేట్రికల్ రన్ లో రూ.170 కోట్ల వసూళ్లు ను నమోదు చేసింది. ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసి కనుక ఉండకపోతే రెండు వందల కోట్ల క్లబ్ లో చేరేది అంటూ కొందరు సినీ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన తర్వాత కూడా థియేటర్ లో ఈ సినిమా రన్ అవుతుంది..
థియేట్రికల్ రన్ లో ఈ సినిమా జోరు కంటిన్యూ అవ్వడంతో ఓటీటీ స్ట్రీమింగ్ అయిన తర్వాత కూడా సాలిడ్ కలెక్షన్స్ ను నమోదు చేసుకొని ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఈ క్లబ్ లో ఉన్న అతి తక్కువ మలయాళ సినిమాల జాబితా లో చిన్న సినిమా అయిన 2018 సినిమా చేరింది. ఈ సినిమా కు వచ్చిన కలెక్షన్స్ చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.అయిదు కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కు ఆ స్థాయి వసూళ్లు నమోదు అవ్వడం ప్రపంచ రికార్డ్ అంటూ కూడా మలయాళ మీడియా వర్గాల వారు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారం ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. సినిమా బాగుంది అనే టాక్ వస్తే చాలు ప్రతి ఒక్కరు కూడా చూసి ఆ సినిమా ను ఆదరిస్తారు. ఇప్పుడు 2018 సినిమా విషయం లో కూడా అదే జరిగింది అని చెప్పవచ్చు.ఈ సినిమా ఓటీటీ లో కూడా అదిరిపోయే వ్యూస్ ను అయితే సొంతం చేసుకుందని తెలుస్తుంది.