Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News 200 Rotting Corpses Found On Hospital Roof In Multan In Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో షాకింగ్‌.. ఆస్పత్రి పైకప్పుపై 200 కుళ్లిపోయిన శవాలు

Published Date :October 15, 2022 , 10:47 am
By Mahesh Jakki
Pakistan: పాకిస్తాన్‌లో షాకింగ్‌.. ఆస్పత్రి పైకప్పుపై 200 కుళ్లిపోయిన శవాలు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Pakistan: పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో గల ముల్తాన్‌లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ముల్తాన్‌లోని నిస్తార్‌ ఆస్పత్రిలో సుమారు 200 మృతదేహాలు మార్చురీ పైకప్పుపై కుళ్లిన స్థితిలో బయటపడడం కలవరం రేపింది. ఆ మృతదేహాలన్ని గుర్తు పట్టలేనంతగా కుళ్లిపోయాయి. కొన్ని శవాలను ఛాతులను చీల్చి అవయవాలను తీసి ఆసుపత్రి పైకప్పుపై పడేశారు. పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు తారిక్‌ జమాన్ గుజ్జార్‌ ఆ మార్చురీకి వెళ్లి కుళ్లిపోయిన మృతదేహాలను గుర్తించారు. ఆసుపత్రి సందర్శనకు వెళ్లిన ఆయనకు మార్చురీలో పడి ఉన్న మృతదేహాల గురించి ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా.. ఆయన వెంటనే మార్చురీ వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శవాలను చూసి చలించిపోయారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ వ్యక్తి తనకు ఫిర్యాదు చేయగానే.. తనిఖీ చేయడానికి వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది తనను మార్చురీలోకి వెళ్లడానికి అంగీకరించలేదని తెలిపారు. కోపంతో తలుపులు తెరవకపోతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని హెచ్చరించడంతో తలుపులు తెరిచినట్లు ఆయన వివరించారు. అక్కడి దృశ్యం తనను తీవ్రంగా కలిచివేసిందని, షాక్‌కు గురిచేసిందని తారిక్‌ జమాన్ గుజ్జార్‌ అన్నారు. మార్చురీని తెరిచినప్పుడు ఆ గదిలో దాదాపు 200 మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయని.. కుళ్లిపోతున్న స్త్రీ, పురుష మృతదేహాలు నగ్నంగా ఉన్నాయన్నారు. కనీసం స్త్రీల మృతదేహాలను కూడా కప్పలేదనన్నారు. షాక్‌ అయిన ఆయన.. ఇదేంటి అని అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే. అవన్నీ వైద్య విద్యార్థులు ప్రాక్టికల్స్ కోసం వాడుతున్నారని చెప్పారని గుజ్జార్ చెప్పారు.

Also Read

  • Tamil Nadu: విజయ్‌‌కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్‌భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
  • TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
  • Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
  • Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
Add as a preferred
source on google

ఈ మృతదేహాలను విక్రయిస్తారా అని మార్చురీ అధికారులను ప్రశ్నించినట్లు గుజ్జార్ తెలిపారు. అలాగే ఈ ఘటనపై వివరణ ఇవ్వాలను తాను వైద్యులను కోరాననన్నారు. శవాలు పడి ఉన్న తీరు చూస్తుంటే విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లుగా కనిపించడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ మృతదేహాలపై పిచ్చి మొక్కలు మొలిచాయని గుజ్జార్‌ చెప్పారు. తన 50 ఏళ్ల జీవితంలో ఇలాంటివి చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు. రూఫ్‌పై ఉన్న మృతదేహాలకు కూడా బట్టలులేవు. డేగలు, పక్షులు ఆ మృతదేహాలను ఆహారంగా స్వీకరిస్తున్నట్లు తెలిసింది. మెడికల్‌ స్టూడెంట్స్‌ ఆ మృతదేహాలను వాడిన తర్వాత సరైన రీతిలో డీకంపోజ్‌ చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. నిస్తార్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యం ఈ ఘటనపై స్పందించింది. మృతదేహాలను వదిలేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పింది.

Loan App Crime: లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి మృతి.. విచారణలో షాకింగ్ నిజాలు

ముల్తాన్‌లో నిస్తార్‌ ఆసుపత్రి మార్చురీ కప్పుపై మృతదేహాలు ఉన్నాయన్న వార్త పాకిస్తాన్‌లో కలకలం రేపింది. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చౌదరి జమాన్ గుజ్జర్ సలహాదారు వెలుగులోకి తెవడంతో ఆసుపత్రిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటనపై నిస్తార్‌ మెడికల్‌ యూనివర్సిటీ ప్రతినిధి సజ్జాద్‌ మసూద్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. మృతదేహాలు కుళ్లిపోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి విచారణ కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. అయితే మార్చురీ పైకప్పుపై డజన్ల కొద్ది మృతదేహాలు లేవని, కేవలం నాలుగు మృతదేహాలు మాత్రమే ఉన్నాయని, వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం వాడే ముందు వాటిని సహజంగా డ్రైగా అయ్యేందుకు అలా వదిలేశారని పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పంజాబ్ సౌత్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సాకిబ్ జాఫర్ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి, మృతదేహాలను అపవిత్రం చేయడం, వదిలివేయడంపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 200 rotting corpses
  • hospital roof
  • multan
  • multan hospital
  • Pakistan

తాజావార్తలు

  • Tamil Nadu: విజయ్‌‌కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్‌భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?

  • TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!

  • Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!

  • Sheraz Mehdi: టాలీవుడ్‌లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!

  • Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions