Nandamuri Balakrishna: పదేళ్ల బీఆర్ ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ చెక్ పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వియజయకేతనం ఎగురవేసింది. ఇక గత రెండు రోజుల నుంచి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరు.. ? అనేది ఎంతో ఉత్కంఠను రేకెత్తించింది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. ఇలా సీఎం పదవి కోసం లైన్లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక చివరికి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని అధికారికంగా ప్రకటించారు. దీంతో తెలంగాణ ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ .. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపాడు.
Chitra Shukla: పెళ్లి పీటలు ఎక్కుతున్న రాజ్ తరుణ్ హీరోయిన్
“తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారు.తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చాలని మరియు అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిపదంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి మీ పాలన మార్క్ తో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అంటూ పత్రికా ప్రకటనను రిలీజ్ చేశాడ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఒకప్పుడు రేవంత్ రెడ్డి.. టీడీపీలో ఉన్న విషయం తెల్సిందే.