Viral News: సాధారణంగా రెండు నెలల వయసున్న పసిబిడ్డలు ఏం చేస్తారు.. తల్లి పాలు తాగి హాయిగా బజ్జుంటారు. లేస్తే ఏడుస్తారు.. కాళ్లు చేతులు ఆడిస్తూ తనలో తాను ఆడుకుంటారు. అసలు ప్రపంచంతో వారికి సంబంధం కూడా ఉండదు.. కానీ ఆ వయసులో ఓ చిన్నారి పాటలు పాడుతుందంటూ నమ్మగలరా.. ఇది నిజమండి ! ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తన తాత లాలి పాట పాడుతుంటే… దానికి కోరస్ పాడుతోంది. కావాలంటే వీడియో మీరు చూడండి… ఆ పసిబిడ్డ తాత వంక తదేకంగా చూస్తూ తాను కూడా శృతి కలపడం నిజంగా విడ్డూరంగానే ఉంది.
Read Also: Prabhas: కృతి సనన్ కి ప్రభాస్ అప్పుడే ప్రపోజ్ చేశాడా?
ఈ వీడియోకు నెట్టింట బాగా క్రేజ్ వచ్చింది. వీడియో చూసిన వాళ్లంతా ఈ కాలం పిల్లలు ఫాస్ట్ అనుకున్నాం కానీ మరింత ఫాస్ట్ గా ఉన్నారే అంటూ ముక్కు న వేలేసుకుంటున్నారు. వార్నీ ఇదేనేమో కంప్యూటర్ కాలంలో పిల్లలంటే అంటున్నారు. తాత శిశువును తన చేతుల్లో పట్టుకొని పాట పాడుతుండగా.. తాతయ్యను అనుకరించే ప్రయత్నం చేసింది. తాత గొంతు అద్భుతంగా ఉంది. ఆ చిన్నారి ప్రయత్నం చాలా బాగుందంటున్నారు నెటిజన్స్.
2-month-old sings a duet with grandpa. 🎶👶🏽❤️👴🏽🎵
(🎥:tinaburtonmiddlet)— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) November 28, 2022