ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ ‘కృతి సనన్’ రిలేషన్ లో ఉన్నారనే వార్త చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ మాటని నిజం చేస్తూ హీరో ‘వరుణ్ ధావన్’ రీసెంట్ గా కృతి సనన్ మనుసులో ఉన్న హీరో ప్రస్తుతం ‘దీపిక’తో షూటింగ్ చేస్తున్నాడు అనే హింట్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారు అనే మాట నిజమని చాలా మంది నమ్ముతున్నారు. ఎవరు ఏ మాట్లాడినా కృతి, ప్రభాస్ లు మాత్రం ఇప్పటివరకూ ఈ విషయంపై స్పందించలేదు. తాజాగా కృతి ప్రభాస్ ల ప్రేమ వ్యవహారం గురించి ‘ఉమైర్ సంధు’ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్, సినీ క్రిటిక్ అని చెప్పుకునే ‘ఉమైర్ సంధు’ సినిమాల గురించి, ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల గురించి, గాసిప్స్ గురించి ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రభాస్ కృతి సనన్ ల గురించి కూడా అలాంటి ట్వీట్ ఒకటి చేశాడు.
Officially Confirmed ! #Prabhas proposed #KritiSanon during shoot of #Adipursh ! They are in relationship now !!! Engagement on the way very soon 🔥🕺🏻🕺🏻❤️❤️
— Umair Sandhu (@UmairSandu) November 28, 2022
ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్ సమయంలోనే కృతికి ప్రపోజ్ చేశాడు. వాళ్లు ఇప్పుడు రిలేషన్ లో ఉన్నారు, త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకుంటారు అంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ప్రభాస్ వెళ్లి కృతి సనన్ కి ప్రపోజ్ చేయడం ఏంటి? అది ఫేక్ న్యూస్ అయ్యి ఉంటుందని రెబల్ స్టార్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉమైర్ సంధు చేసిన ట్వీట్ లో నిజం ఎంత అనేది తెలియదు. అయితే అందరికన్నా ముందు దాదాపు రెండున్నర నెలల క్రితం ప్రభాస్ కృతి సనన్ రిలేషన్ లో ఉన్నారు అనే విషయాన్ని ట్వీట్ చేసిన మొదటి వ్యక్తి మాత్రమే ఉమైర్ సంధునే కావడం విశేషం.