Aircraft Crash: ఇంటిపై కుప్పకూలిన మిగ్-21 విమానం.. ముగ్గురు పౌరులు మృతి.. పైలట్ సేఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aircraft Crash: వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 సోమవారం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఓ ఇంటిపై కూలిపోయిందని, ముగ్గురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోగా, పైలట్ సురక్షితంగా ఉన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి. హనుమాన్‌గఢ్ జిల్లాలోని పిలిబంగా సమీపంలో సాంకేతిక లోపం కారణంగా సూరత్‌గఢ్ ఎయిర్‌బేస్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. పైలట్ సకాలంలో పారాచూట్ ఉపయోగించి విమానం నుండి దూకాడని, అతను సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయని, ఘటనపై విచారణకు ఆదేశించామని వైమానిక దళం తెలిపింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్థానికులు ప్రాణాలు కోల్పోగా.. పైలట్ సురక్షితంగా ఉన్నారని, సహాయక చర్యల కోసం సైన్యానికి చెందిన హెలికాప్టర్ ప్రమాద స్థలానికి చేరుకుందని తెలిసింది. ఐఏఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం విమానం సూరత్‌గఢ్ నుండి బయలుదేరింది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
“ఈరోజు ఉదయం సాధారణ శిక్షణలో భాగంగా సూరత్‌గఢ్ సమీపంలో ఐఏఎఫ్‌కి చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ ఏర్పాటు చేయబడింది” అని వాయుసేన ట్వీట్ చేసింది. విమానం కూలిపోయిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. “పైలట్ మానవ ప్రాణనష్టాన్ని నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. గ్రామ శివార్లలో విమానాన్ని క్రాష్-ల్యాండ్ చేసాడు” అని బికనీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాష్ తెలిపారు.
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
Read Also: Pak Flight: భారత గగనతలంలోకి పాక్ విమానం.. వర్షం దెబ్బకు దారి తప్పిందట!
ఇటీవల విమాన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. జనవరిలో భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్ సు -30, మిరాజ్ 2000 కూలిపోవడంతో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక విమానం కూలిపోగా, మరొకటి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూలిపోయింది. గత వారం ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఏప్రిల్‌లో కొచ్చిలో ట్రయల్స్ సమయంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చేయడంతో మరో ప్రమాదం జరిగింది. ఈ మార్చిలో ముంబైలో నేవీ హెలికాప్టర్ కుప్పకూలింది. గత ఏడాది అక్టోబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన రెండు సంఘటనలు నమోదయ్యాయి. అక్టోబరు 5, 2022లో, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతానికి సమీపంలో చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో ఒక భారతీయ ఆర్మీ పైలట్ మరణించాడు.
#WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. Two civilian women died and a man was injured in the incident, the pilot sustained minor injuries. pic.twitter.com/z4BZBsECVV
— ANI (@ANI) May 8, 2023
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!