Aligarh Plane Crash: ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. పయనీర్ అకాడమీ శిక్షణ విమానం ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా కూలిపోయింది. రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా, విమానం రన్‌వే సరిహద్దును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం వేగం తక్కువగా ఉండడంతో అదృష్టవశాత్తూ పైలట్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు విమానయాన శాఖ డైరెక్టర్ ఎస్ఎస్ అగర్వాల్ తెలిపారు. Read Also: India Pakistan War:…
South Korea: సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ముయూన్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై విమానం అదుపు తప్పి పక్కనే ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం ఒక్కసారిగా పేలిపోయింది.
Aircraft Crashed: అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో బాంబర్డియర్ ఛాలెంజర్ 300 విమానం ప్రమాదవశాత్తు భవనంను ఢీకొన్న ఘటనలో పైలట్, కో-పైలట్ మరణించారు. పుంటా డెల్ ఏస్తే నుండి బయలుదేరిన ఈ విమానం సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో లోపల కారణంగా, పక్కనే ఉన్న నివాస ప్రాంతాలలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చివరకు విమానం ఒక నివాస ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం వల్ల పక్కన ఉన్న కొన్ని ఇళ్లను…
భారత వైమానిక దళానికి చెందిన వాయుసేన శిక్షణ విమానం ప్రమాదానికి గురయింది. భారత వైమానిక దళానికి చెందిన కిరణ్ శిక్షణ విమానం కర్ణాటకలో నేలకూలింది. కర్ణాటకలోని చామరాజనగర్‌లోని మాకాలి గ్రామంలో విమానం క్రాష్ అయ్యింది.
వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 సోమవారం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో కూలిపోయిందని, పైలట్ సురక్షితంగా ఉన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చార్టర్డ్ విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపంతో ఆ విమానం కూలినట్లు తెలిసింది. ఘటనా స్థలానికి పోలీసులు, అధికారులను పంపినట్లు జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ తెలిపారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేవా జిల్లాలో శిక్షణ విమానం కూలిపోవడంతో పైలట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో విమానంలో ఉన్న ట్రైనీ పైలట్ గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు.
మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని ఇందాపూర్ తాలూకాలో గల కడ్బన్‌వాడి గ్రామంలో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఒక ట్రైనీ విమానం వ్యవసాయ క్షేత్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ శిక్షణలో ఉన్న 22 ఏళ్ల భావికా రాఠోడ్ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది.