Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 19 మంది మావోయిస్టుల మృతి!
- ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
- 19 మంది మావోయిస్టుల మృతి
- జనవరిలోనే 27 మంది మావోయిస్టులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన ఎన్‌కౌంటర్‌లో ముందుగా నలుగురు చనిపోగా.. ఆ తరువాత మృతుల సంఖ్య 12కు పెరిగింది. ఈ రోజు ఉదయం వరకు మొత్తంగా 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దు బీజాపూర్‌లోని మరూర్ బాకా, పూజారి కంకేర్ ప్రాంతంలో మావోయిస్టులకి, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది నక్సలైట్ల మృతి చెందినట్లుగా భద్రత బలగాలు స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుండి ఎస్ఎల్ఆర్, బీజీసీ, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్‌కౌంటర్‌లో పాల్గొనేందుకోసం బీజాపూర్, సుకమా, దంతేవాడ జిల్లా నుంచి కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపుగా వెయ్యి మంది వరకు తరలి వెళ్లినట్లుగా తెలుస్తుంది. మావోయిస్టులు సమావేశం అవుతున్న సమాచారం మేరకు ఈ భద్రత బలగాలు అక్కడికి వెళ్లి కాల్పులు జరిపారు. సమావేశం అనంతరం మావోయిస్టులు అడవిలోకి వెళుతుండగా.. వారి వెంటపడి చంపినట్లుగా తెలుస్తోంది. భారీగా తరలి వచ్చిన భద్రత బలగాలు మావోయిస్టులను ఎవరినీ వదిలిపెట్టకుండా వెంటపడినట్లు తెలుస్తోంది.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
Also Read: Hyderabad: అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటన.. నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు గాలింపు!
ఈ ఒక్క జనవరిలోనే ఇప్పటివరకు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా భద్రత బలగాలు 9 మంది మందుపాతర పేలుడులో మృతి చెందారు. గత ఏడాది 270 మందికి పైగా మావోయిస్టులు పోలీసుల చేతిలో మృతి చెందారు. బీజాపూర్ జిల్లా కుట్టు వద్ద ఈ నెల 6న జరిగిన మందు పాతరలో 9 మంది జవానులు మృతి చెందారు. దీంతో అదే ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వరుస ఎన్‌కౌంటర్‌లు బీజాపూర్ జిల్లాలోనే పోలీసులు చేపట్టారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!