Xi Jinping Welcomes Trump: ట్రంప్‌కు జిన్‌పింగ్ గ్రాండ్ వెల్కమ్.. ప్రోటోకాల్ పక్కనపెట్టి ఆలింగనం! వైరల్‌గా వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping Welcomes Trump: చైనా పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రత్యేక స్వాగతం పలికారు. సాధారణ దౌత్య ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి స్వయంగా విమానాశ్రయానికి చేరుకున్న జిన్‌పింగ్.. ట్రంప్‌కు స్వాగతం పలకడంతో పాటు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య, సాంకేతిక, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరువురు నేతల భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) దేశాధినేతల సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చైనాలోని షెన్జెన్ నగరానికి చేరుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఆసియాన్ (ASEAN) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన నేరుగా చైనాకు వెళ్లారు. ట్రంప్ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం షెన్జెన్ విమానాశ్రయంలో దిగిన తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్వయంగా విమానం వద్దకు చేరుకుని స్వాగతం పలికారు.
Also Read
- Muslim Population 2035: 2035 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం?.. ప్యూ రీసెర్చ్ సంచలన అంచనాలు!
- Ukraine: ‘‘పుతిన్‌ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్పింగ్లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
- Bilawal Bhutto: ఇమ్రాన్ ఖాన్‌పై ఇంకెంత ప్రతీకారం తీర్చుకుంటారు?.. పాక్ రాజకీయాల్లో భుట్టో కలకలం!
- Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
విమానం మెట్ల వద్దకు చేరుకున్న ట్రంప్‌తో జిన్‌పింగ్ కరచాలనం చేశారు. అనంతరం ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. నృత్యకారులు పూలు, జాతీయ జెండాలు పట్టుకుని ఆయనకు ఆహ్వానం పలికారు. అయితే ఇదే రోజు చైనాకు చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు జిన్‌పింగ్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకలేదు. పుతిన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ట్రంప్‌కు ప్రత్యేకంగా స్వాగతం పలకడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
అమెరికా, చైనా మధ్య చాలా కాలంగా వాణిజ్యపరమైన పోటీ, సుంకాల వివాదాలు, సాంకేతిక రంగంలో ఆధిపత్య పోరు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్, జిన్‌పింగ్ సమావేశం అత్యంత కీలకంగా మారింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సంప్రదాయ మిత్రదేశాలైన కెనడా, యూరప్‌లోని నాటో (NATO) సభ్య దేశాలతో కూడా సంబంధాలు కొంత ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ఇలాంటి సమయంలో చైనా, రష్యా వంటి దేశాల నేతలతో అమెరికా సంబంధాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
చైనా నుంచి అమెరికాకు భారీగా వస్తున్న దిగుమతులను నియంత్రించడంతో పాటు వాణిజ్య లోటును తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం చైనా వస్తువులపై భారీ సుంకాలు విధించింది. అయినప్పటికీ ప్రపంచ తయారీ రంగంలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. చైనా ఎగుమతులు దిగుమతుల కంటే ఏటా భారీగా అధికంగా ఉంటున్నాయి. వరుసగా రెండో ఏడాది కూడా చైనా వస్తువుల ఎగుమతులు, దిగుమతుల కంటే ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా అధికంగా ఉండే దిశగా సాగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, దిగుమతి సుంకాలు, ఎగుమతులపై చర్చలు జరగనున్నాయి.
APEC సదస్సులో కృత్రిమ మేధస్సు (AI) కూడా కీలక అంశంగా మారనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏఐ సాంకేతికత కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పటికీ, దాని వినియోగం, భద్రత, నియంత్రణపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ సాంకేతికత అభివృద్ధికి అవసరమైన అధునాతన కంప్యూటర్ చిప్స్, సెమీకండక్టర్ల సరఫరాపై అమెరికా, చైనా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. చైనా ఏఐ మోడల్స్ అభివృద్ధి చేసేందుకు ఉపయోగించే అధునాతన చిప్స్ ఎగుమతులపై అమెరికా మరింత కఠినమైన ఆంక్షలు ఎందుకు విధించడం లేదని ఇటీవల ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ అంశంపై తన ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ట్రంప్ అంగీకరించారు. చైనాకు చిప్స్ ఎగుమతులను పరిమితం చేయడంపై వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. అయితే చైనాతో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆ దేశాన్ని అవమానించేలా వ్యవహరించకూడదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా, చైనా మధ్య సంబంధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. వాణిజ్యం, సాంకేతికత, ఏఐ, సెమీకండక్టర్లు, అంతర్జాతీయ భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య జరిగే చర్చలు భవిష్యత్ పరిణామాలను నిర్ణయించనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు జిన్‌పింగ్ స్వయంగా స్వాగతం పలకడం, ఇద్దరూ ఆలింగనం చేసుకోవడం ఈ సమావేశానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. అయితే ఈ ఆత్మీయ స్వాగతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న విభేదాలకు ఎంతవరకు పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి.
VIDEO | Chinese President Xi Jinping receives his US counterpart Donald Trump at Shenzhen airport ahead of the APEC summit.
The 33rd Asia-Pacific Economic Cooperation (APEC) Economic Leaders’ Meeting is taking place in Shenzhen, Guangdong Province, China.
Source: AFP/PTI (Only to use in India)
— Press Trust of India (@PTI_News) November 18, 2026
తాజావార్తలు
-
Xi Jinping Welcomes Trump: ట్రంప్‌కు జిన్‌పింగ్ గ్రాండ్ వెల్కమ్.. ప్రోటోకాల్ పక్కనపెట్టి ఆలింగనం! వైరల్‌గా వీడియో
-
Muslim Population 2035: 2035 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం?.. ప్యూ రీసెర్చ్ సంచలన అంచనాలు!
-
Astrology: నవంబర్ 19 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..