Smart Phone : కరోనా పుణ్యమాని మనిషి జీవితం తారుమారైంది. ప్రభుత్వాలు లాక్డౌన్లు పెట్టడంతో.. విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులకు ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. అవి వినేందుకు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కంపల్సరీ అయ్యాయి. ఈ క్రమంలోనే వారు ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. ఎంతలా అంటే ఫోన్ కోసం ఎంతకైనా తెగించే విధంగా మారిపోతున్నారు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన 16 ఏళ్ల బాలిక స్మార్ ఫోన్ కొనడం కోసం ఏకంగా తన రక్తాన్ని అమ్మేందుకు ప్రయత్నించింది.
ఈ షాకింగ్ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని దినజ్‌పూర్ జిల్లాలో జరిగింది. స్మార్ట్‌ఫోన్ కొనడానికి తన రక్తాన్ని విక్రయించడానికి సోమవారం జిల్లా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్‌ను సంప్రదించింది. దినజ్‌పూర్ జిల్లాలోని తపన్ పోలీస్ స్టేషన్ పరిధి కర్దా ప్రాంతంలో నివసిస్తున్న 16 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతున్నది. స్మార్ట్ ఫోన్ కొనాలని భావించిన ఆమె రూ.9,000 విలువైన మొబైల్ ఫోన్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. అయితే ఆ మొబైల్ అందేలోపు అంత డబ్బు ఏర్పాటు చేసుకోవడం కష్టంగా భావించింది. దీంతో తన రక్తాన్ని అమ్మి డబ్బులు సమకూర్చుకునేందుకు ఆ బాలిక ప్రయత్నించింది.
Read Also: Madhya Pradesh: బట్టల్లేకుండా వస్తానంటే.. కలెక్టర్ కమ్ అన్నాడంట
బాలూరాఘట్ లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లి, అక్కడి సిబ్బందిని కలిసింది బాలిక. డబ్బులిస్తే రక్తం ఇస్తానని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన బ్లడ్ బ్యాంక్ అధికారులు చైల్డ్‌లైన్ ఇండియాకు సమాచారం అందించారు. అనంతరం ఆ బాలిక అసలు రక్తం ఎందుకు అమ్మాలనుకుంటోందో ఆరా తీశారు. ముందు తన సోదరుడి చికిత్స కోసం ఆ బాలిక అబద్దం చెప్పినా.. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్ కొనుగోలు కోసమని చెప్పడం విని అధికారులు షాకయ్యారు. జిల్లా శిశు సంక్షేమ కమిటీ సహకారంతో బాలికను తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ చేశారు.
Read Also: Gym Trainer : హార్ట్ ఎటాక్ తో కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలొదిలిన జిమ్ ట్రైనర్
ఈ మేరకు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు…ఉదయం 10 గంటలకు ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చింది. జిల్లా ఆసుపత్రికి చెందిన బ్లడ్ బ్యాంక్ కావడంతో రక్తం తీసుకునేందుకు వచ్చిందని మొదట్లో అనుకున్నాం. కానీ ఆమె మాకు రక్తాన్ని అమ్మాలనుకుంటున్నట్లు చెప్పినప్పుడు మేమంతా షాక్ అయ్యాము..అని బాలూర్‌ఘాట్ జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ నుండి కనక్ కుమార్ దాస్ అన్నారు.