ఇటీవల గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండడంతో ఆందోళన నెలకొంది. తమ పిల్లలకు ఎప్పుడు ఏమవుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు మరో ఘటన చోటుచేసుకుంది. అయితే ఇది ఫుడ్ పాయిజన్ వల్ల మాత్రం కాదు. స్కూల్ ఆవరణలో దోమల మందు పిచికారీ చేయడంతో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం చందనపూర్ గ్రామంలోని బాలుర గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు.
Also Read:Kovvur Midnight Clash: కొవ్వూరులో కూటమి నేతల కుమ్ములాటలు – జనసేన శ్రేణుల ఆందోళన
అస్వస్థత గురైన 5, 6, 7, 8 తరగతులకు చెందిన 16 మంది విద్యార్థులు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది అనారోగ్యానికి గురైన విద్యార్థులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తగు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి స్కూల్ ఆవారణలో దోమల మందు పిచికారి చేయించిన పాఠశాల సిబ్బందిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.