విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు తప్పటడుగులు వేస్తున్నారు. కొందరు టీచర్లు తమ వికృత చేష్టలతో ఉపాధ్యాయ లోకానికి మాయని మచ్చగా మారుతున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. తాజాగా గురుకుల విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని ఓ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడింది వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి. 10వ…
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్లే సమయంలో పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపోయింది.
ఇటీవల గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండడంతో ఆందోళన నెలకొంది. తమ పిల్లలకు ఎప్పుడు ఏమవుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు మరో ఘటన చోటుచేసుకుంది. అయితే ఇది ఫుడ్ పాయిజన్ వల్ల మాత్రం కాదు. స్కూల్ ఆవరణలో దోమల మందు పిచికారీ చేయడంతో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం చందనపూర్ గ్రామంలోని బాలుర గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. Also Read:Kovvur Midnight Clash: కొవ్వూరులో…
గురుకుల పాఠశాలలో విద్యార్థినులు పడుతున్న భాదలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. పైడి రాకేష్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గంలోని ఓ గురుకుల విద్యార్థినులు తమకు సరిగా అన్నం కూడా పెట్టడం లేదని కన్నీరుమున్నీరు అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన తెలంగాణ రాష్ట్రంలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా? అంటూ ఆవేదన…
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న బోడ యశ్వంత్‌ను పాముకాటేసింది. స్కూల్ ప్రిన్సిపల్.. యశ్వంత్‌ను హుటాహుటిన కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. బుధవారం అదే పాఠశాలలో ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కాటేసింది. తాజా ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్ ఈరోజు నిద్ర లేచేసరికి కాలుకు గాయమై.. దురదలు వచ్చాయి. అతడు విషయాన్ని…
సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. వినాయక చవితి రోజున అపశృతి చోటు చేసుకుంది. గణేష్ మండపం కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యార్థికి కరెంట్ షాక్ తగలడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి సాయిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వినాయక చవితి సందర్భంగా మెదక్ జిల్లా టెక్మాల్ మండలం పాపన్న పేట గురుకుల పాఠశాలలో గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు…