జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లాం అధ్యక్షతన భేటీ అయింది. పథకం అమలుపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రుల సబ్ కమిటీ సమీక్షించింది. అయితే, వచ్చే ఏడాది జనవరి నాటికి మూడో దశ సర్వే పూర్తి కావాలి.. దేశంలోనే అత్యంత వేగంగా సమగ్ర సర్వే మన రాష్ట్రంలోనే జరుగుతోంది అని సబ్ కమిటీ పేర్కొంది.
Read Also: Delhi High Court: ఆప్‌కు చెందిన రాఘవ్ చద్దా ప్రభుత్వ బంగ్లాలో ఉండొచ్చు..
రెండు దశల్లో ఇప్పటి వరకు 4 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూహక్కు పత్రాలను కూడా పంపిణీ చేశారు అని మంత్రుల సబ్ కమిటీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,072 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ పూర్తి చేశామన్నారు. కేంద్ర అధికారులతో పాటు అయిదు రాష్ట్రాల నుంచి సర్వే విభాగ కమిషనర్లు రాష్ట్రంలో పర్యటించారు.. రాష్ట్రం అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి సర్వే పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు అని కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు అన్నారు.
Read Also: KP Nagarjuna Reddy: మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
బ్రిటీష్ పాలన తరువాత రాష్ట్రంలో ఒకేసారి నిర్థిష్టమైన విధానంతో జరుగుతున్న ఈ సర్వేలో ఎటువంటి అలసత్వం సహించేది లేదని అన్నారు. సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సబ్ కమిటీ తెలిపింది. ఇప్పటికే సమగ్ర సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామకంఠం భూముల్లో నివాసితులకు న్యాయం జరిగేలా ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రుల కమిటీ పేర్కొనింది. అలాగే భూ యజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులపై కూడా మొబైల్ మేజిస్ట్రేట్ కోర్ట్‌లో విచారించి, ఎవరికీ అన్యాయం జరుగకుండా చూడాలని కోరారు అని ఏపీ కేబినెట్ సబ్ కమిటీ చెప్పుకొచ్చింది.