పాములను చూస్తే దాదాపు అందరికీ భయం పుడుతుంది. పాము కనిపిస్తే చాలు ప్రాణ భయంతో పరుగులు తీస్తుంటారు. అలాంటిది 15 అడుగుల భారీ గిరినాగు కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. భారీ గిరినాగు జనావాసాల్లో ప్రత్యక్షమవగా ప్రజలు హడలిపోయారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. దేవరాపల్లిలో ఒడ్డు చింతల కల్లాల వద్ద 15 అడుగుల గిరినాగు శుక్రవారం సాయంత్రం హడలెత్తించింది. తారు రోడ్డు దాటుతున్న పామును కుక్కలు అటకాయించాయి. పాము బుసలు కొడుతుండగా రైతులు చూసి పరుగులు తీశారు.
Also Read:Delhi Capitals: కేఎల్ రాహుల్ పునరాగమనం ఖాయం.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో జట్టులోకి
గిరినాగు ప్రక్కనున్న సరుడు తోటలోకి దూరడంతో రైతులు గిరినాగు ఎటు వెళ్లకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ రైతులపై తిరగబడడంతో భయభ్రాంతులకు గురయ్యారు. పామును చూసి హడలిపోయిన ప్రజలు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. స్పందించిన స్నేక్ క్యాచర్స్ వచ్చి చాకచక్యంగా గిరినాగును పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక జనావాసాల మధ్యకు పాములు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు.