పాములను చూస్తే దాదాపు అందరికీ భయం పుడుతుంది. పాము కనిపిస్తే చాలు ప్రాణ భయంతో పరుగులు తీస్తుంటారు. అలాంటిది 15 అడుగుల భారీ గిరినాగు కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. భారీ గిరినాగు జనావాసాల్లో ప్రత్యక్షమవగా ప్రజలు హడలిపోయారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. దేవరాపల్లిలో ఒడ్డు చింతల కల్లాల వద్ద 15 అడుగుల గిరినాగు శుక్రవారం సాయంత్రం హడలెత్తించింది. తారు రోడ్డు దాటుతున్న పామును కుక్కలు అటకాయించాయి. పాము బుసలు కొడుతుండగా రైతులు చూసి…
ఈమధ్య కాలంలో వన్యప్రాణులు, పాములు, ఏనుగులు జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నాయి. కార్లు, స్కూటర్లు, ఇళ్ళల్లోకి పామలు, ఎలుగుబంట్లు వచ్చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. గంట పాటు అటవీశాఖ సిబ్బందిని పాము తిప్పలు పెట్టింది. రెస్క్యూ ఆపరేషన్ చేశాక కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది. మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఒక్కసారిగా విశేష అతిథి సందడి చేసింది. ఉదయం కార్యాలయం తెరిచేసరికి ఓ పాము హల్చల్ చేసింది. కలెక్టర్ సి ఛాంబర్ లో…
ఈమధ్యకాలంలో ఇళ్ళల్లోకే కాదు మనం పార్క్ చేసిన వాహనాల్లోకి పాములు దూరుతున్నాయి. నానా ఇబ్బందులు పెడుతున్నాయి. పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన స్కూటీలో ఓ పాము దూరింది. ఆ పామును బయటకు పంపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు మెకానిక్ ని పిలుసుకొని రావాల్సిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రోజు మాదిరిగానే ఓ ఉపాధ్యాయురాలు తన స్కూటీని స్కూల్ అవరణలో పార్కింగ్ చేశారు. స్కూటీలో పాము ఎలా…