పాములను చూస్తే దాదాపు అందరికీ భయం పుడుతుంది. పాము కనిపిస్తే చాలు ప్రాణ భయంతో పరుగులు తీస్తుంటారు. అలాంటిది 15 అడుగుల భారీ గిరినాగు కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. భారీ గిరినాగు జనావాసాల్లో ప్రత్యక్షమవగా ప్రజలు హడలిపోయారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. దేవరాపల్లిలో ఒడ్డు చింతల కల్లాల వద్ద 15 అడుగుల గిరినాగు శుక్రవారం సాయంత్రం హడలెత్తించింది. తారు రోడ్డు దాటుతున్న పామును కుక్కలు అటకాయించాయి. పాము బుసలు కొడుతుండగా రైతులు చూసి…