Yemen Shipwreck: యెమెన్ తీరంలో పడవ బోల్తా.. 13 మంది మృతి
- యెమెన్ తీరంలో పడవ బోల్తా
- పడవ మునిగిపోవడంతో 13 మంది మృతి
- 14 మంది గల్లంతు.. వారి కోసం గాలింపు చర్యలు
- పడవలో మొత్తం 25 మంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యెమెన్ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ మునిగిపోవడంతో 13 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీని ఉటంకిస్తూ నివేదిక ప్రకారం.. పడవ ప్రమాదంలో 14 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. యెమెన్‌లోని తైజ్ ప్రావిన్స్ తీరంలో మంగళవారం వలస పడవ బోల్తా పడింది. ఈ పడవలో తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాకు చెందిన 25 మంది పౌరులు ఉన్నారు. ఇద్దరు యెమెన్‌కు చెందినవారు ఉన్నారు. కాగా.. ఈ పడవ తూర్పు ఆఫ్రికా దేశం జిబౌటి నుండి బయలుదేరింది.
Read Also: Shiekh Hasina: షేక్ హసీనాపై మరో 4 మర్డర్ కేసులు పెట్టిన బంగ్లాదేశ్..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
పడవ ప్రమాదానికి సంబంధించి IOM నివేదిక ప్రకారం.. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు అన్వేషణ కొనసాగిస్తోంది. తప్పిపోయిన వారిలో యెమెన్ కెప్టెన్.. అతని సహాయకుడు కూడా ఉన్నారు. ఓడ బోల్తా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. యెమెన్‌లోని IOM మిషన్ యొక్క తాత్కాలిక అధిపతి మాట్లాడుతూ.. ఇది ప్రమాదకరమైనది అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో వలసదారులు ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తున్నారని చెప్పారు. జూన్-జూలైలో కూడా పడవ బోల్తా పడిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.
Read Also: Kolkata Doctor Murder: మహిళా డాక్టర్‌పై అత్యాచారం ఘటనపై.. కోల్‌కతా గణేశ్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం
2023లో 97,200 మంది వలసదారులు యెమెన్‌కు వచ్చారు. ఈ సంఖ్య 2022 కంటే ఎక్కువ. భద్రతను దృష్టిలో ఉంచుకుని అధిక సంఖ్యలో ప్రజలు సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్నారు. 10 సంవత్సరాలకు పైగా.. ఈ దేశం పేదరికంతో పాటు అంతర్యుద్ధంతో బాధపడుతోంది. సౌదీ అరేబియా.. ఇతర గల్ఫ్ దేశాలకు కార్మికులుగా, గృహ కార్మికులుగా పనిచేయడానికి ప్రజలు వెళ్తున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!