ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు జరగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ సమావేశపూర్వకంగా తెలిపారు. ఇక ఆ పరీక్షల కోసం 1,61,877 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. వీరిలో 96,938 మంది అబ్బాయిలు, 64,939 మంది అమ్మాయిలు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
Kalki 2898AD: ప్రమోషన్స్ మొదలెట్టేసారు.. ఫ్యాన్స్ ఇక రెడీ అవండమ్మా..
ఇక ఈ పరీక్షల నిర్వహణ కోసం 685 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 685 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇక పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఇక పరీక్షల తేదీల వివరాలు చూస్తే..
* మే 24: ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్-1
* మే 25: సెకండ్ ల్యాంగ్వేజ్
* మే 27: ఇంగ్లిష్
* మే 28: మ్యాథమెటిక్స్
* మే 29: ఫిజికల్ సైన్స్
* మే 30: జీవ శాస్త్రం
* మే 31: సోషల్ స్టడీస్
* జూన్ 1న: కాంపోజిట్ విద్యార్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1
* జూన్ 3న: ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-2 జరగనున్నాయి.