ఓ బాలుడి సమయస్ఫూర్తి చాలా మంది ప్రాణాలు కాపాడింది. పదేళ్ల వయసులోనే పెను ప్రమాదాన్ని తప్పించి వందల మంది ప్రాణాల్ని కాపాడాడు. రైలు ప్రమాదాన్ని గుర్తించిన బాలుడు వెంటనే తన షర్ట్ తీసి ఊపి రైలు ఆగేలా చేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు బాలుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Also Read: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. బ్రేక్, ప్రత్యేక దర్శనాలు రద్దు.. వైవభంగా 7వ రోజు
పశ్చిమబెంగాల్ లోని మాల్దా జిల్లాకు చెందిన ముర్సెలీమ్ అనే పదేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో, కుటుంబంతో కలిసి కరియాలి అనే గ్రామంలో నివసిస్తున్నాడు. అతడికి చేపలు పట్టే అలవాటు ఉంది. అలాగే మొన్న కూడా అతడు చేపలు పట్టడానికి అక్కడే ఉన్న ఓ కుంట దగ్గరకు వెళుతున్నాడు. అక్కడికి వెళ్లాలంటే రైల్వే ట్రాక్ దాటుకొని వెళ్లాలి. అటుగా కుంట వద్దకు వెళుతున్న బాలుడు రైలు పట్టాల కింద గొయ్యి గమనించాడు. అలా ఉంటే ప్రమాదం అని అంత చిన్న వయసులోనే బాలుడికి తెలుసు. అయితే బాలుడు అక్కడ ఉన్నప్పుడే అగర్తల-సియాల్దా కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్ వేగంగా అటువైపు దూసుకు వస్తుంది. ప్రమాదం రాబోతుందని గ్రహించిన బాలుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా తాను ధరించిన ఎర్ర టీ షర్ట్ తీసి గాల్లో ఊపి లోకో పైలెట్ ను అప్రమత్తం చేశాడు. దీంతో లోకోపైలెట్ వెంటనే రైలును ఆపేశాడు. బాలుడి వద్దకు వెళ్లి అక్కడ చూడగా పట్టాల కింద గొయ్యి కనిపించింది. అక్కడి కంకర కొట్టుకుపోవడంతో గొయ్యి ఏర్పడినట్టు గుర్తించారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించిన లోకోపైలెట్ బాలుడిని పొగడ్తల్లో ముంచెత్తారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించిన ఆయన బాలుడిని పొగడ్తల్లో ముంచెత్తారు. అనంతరం రైల్వే సిబ్బంది ఆ గొయ్యిని పూడ్చేయడంతో గంట తరువాత రైలు అక్కడి నుంచి బయలుదేరింది.