ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. 10 ఏండ్ల బాలుడిని నరబలి ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. మూఢనమ్మకాలతో బంధువే అతని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. బహ్రైచ్ జిల్లా పర్సా గ్రామానికి చెందిన కృష్ణవర్మ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతనికి వివేక్ వర్మ అనే 10 ఏళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. కృష్ణవర్మకు అదే గ్రామంలో అనూప్ అనే ఓ బంధువు ఉన్నాడు. అనూప్ కు రెండున్నరేండ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు గత కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
Also Read : CPI Narayana : మోడీ ప్రభుత్వం రాక్షస పాలనను కొనసాగిస్తుంది
ఈ క్రమంలో అనూప్.. ఓ తాంత్రికుడిని సంప్రదించాడు. నరబలి చేస్తే అంతా బాగుంటుందని ఆ తాంత్రికుడు అతనికి చెప్పాడు. మంత్రగాడి మాట నమ్మిన అనూప్.. వరుసకు మేనమాన చింతారామ్ తో కలిసి గురువారం రోజు రాత్రి వివేక్ వర్మను ఎత్తుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతుకోసి చంపేశాడు. అనంతరం అక్కడ నుంచి తప్పించుకున్నారు. అయితే వివేక్ వర్మ కనిపించకుండా పోవడంతో అతని తండ్రి కృష్ణవర్మ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
Also Read : Balayya: ఏంటయ్యా నవదీప్ నీ నాన్సెన్స్… డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడమేగా
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలోని పొలాల్లో వివేక్ వర్మ మృతదేహం లభించింది. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అసలు విషయం బయటపడింది. తాంత్రికుడి మాటలు నమ్మిన అనూప్.. వివేక్ వర్మను నరబలి ఇచ్చినట్లు తేలింది. దీంతో మంత్రగాడితో పాటు అనూప్ ను.. అతనికి సహకరించిన చింతారామ్ ను అరెస్ట్ చేశామని బరైచ్ ఎస్పీ ప్రశాంత్ వర్మ వెల్లడించారు.