Sniffer Dogs: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో స్నిఫర్ డాగ్‌లను ఎంపీ పోలీసులు సత్కరిస్తున్నట్లు చూపిస్తుంది. మధ్యప్రదేశ్ పోలీసులు పదవీ విరమణ వేడుకను నిర్వహించారని, ఇందులో మొత్తం 10 స్నిఫర్ డాగ్‌లను సన్మానించారని వైరల్ వీడియో ద్వారా తెలుస్తోంది. వేడుక సందర్భంగా ఈ కుక్కలకు వారి అమూల్యమైన, అద్భుతమైన సేవకు గొప్ప వీడ్కోలు లభించింది. సోషల్ మీడియా యూజర్లు కూడా వీడియో చూసిన తర్వాత భిన్నమైన స్పందనలు ఇచ్చారు. ఇప్పటివరకు ఈ వీడియోను 14 వేల వ్యూస్, 400కు పైగా లైక్‌లు వచ్చాయి.
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మధ్యప్రదేశ్ పోలీసులు 10 స్నిఫర్ డాగ్‌లకు ఒకదాని తర్వాత ఒకటి వీడ్కోలు పలికినట్లు కనిపించింది. ఇందులో కుక్కలను పోలీసు ఉన్నతాధికారులు వేదికపైకి పిలిచి పూలమాల వేశారు. వీడియోలో ప్రతి కుక్కకు ఒక పోలీసుతో పాటు వేదికపై ఉన్న అధికారులు పూలమాలలు వేయడం కనిపిస్తుంది. ఈ వేడుకలో పలువురు పోలీసులు కూడా పాల్గొన్నారు.
Read Also:Espionage Charge: జీ20 సమావేశ రహస్య సమాచారం లీక్.. విదేశాంగ శాఖ ఉద్యోగి అరెస్ట్
कभी देखी है ऐसी विदाई @MPPoliceDeptt के डॉग्स की, हत्या लूट के मामले की तफ़तीश कर पुलिस की नौकरी के बाद सेवानिवृत्त हुये दस डॉग्स को मध्य प्रदेश पुलिस से इस शान से विदाई दी गई, @DGP_MP @drnarottammisra pic.twitter.com/PtP09ypHSB
— Brajesh Rajput (@brajeshabpnews) July 9, 2023
ఈ వీడియోను @brajeshabpnews అనే జర్నలిస్ట్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోను చూసిన చాలామంది తమ స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. ఒక వినియోగదారు “కుక్క ఈ గౌరవానికి అర్హత కలదని పేర్కొన్నాడు. మరొక నెటిజన్ “అందరికీ అభినందనలు.. శుభాకాంక్షలు” అని రాశారు.