దలపతి విజయ్ నటించిన భారీ చిత్రం జననాయకన్. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే మొదటి నుండి ఈ చిత్రం ‘బనావ్ భేటీ కో షేర్’ కథ నేపథ్యంలో బాలయ్య నటించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా భగవంత్ కేసరికి అఫీషియల్ రీమేక్ అని ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పటి నుండి టాక్ వినిపిస్తూనే ఉంది. జననాయగన్ నుండి రిలీజ్ అయిన ప్రతి పోస్టర్, సాంగ్స్ కూడా భగవంత్ కేసరిని పొలిఉన్నాయి.. అయితే దర్శకుడు హెచ్. వినోద్ మలేషియాలో జరిగిన జన నాయగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జననాయకన్ 100 శాతం తలపతి విజయ్ సినిమా. థియేటర్లలో అభిమానులకు ఇది ఒక భారీ కమర్షియల్ ట్రీట్‌గా నిలుస్తుందని ఈ సినిమా రీమేక్ కాదని వాదించాడు.
Also Read : SURIYA 46 : సూర్య 46 సినిమాలో మలయాళ యంగ్ హీరో గెస్ట్ అప్పీరియన్స్
కానీ తాజాగా జననాయకన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసాక ఇది భగవంత్ కేసరి రీమేక్ కాదు.. జస్ట్ కాపీ పేస్ట్ అని అర్ధం అయింది. సీన్ టు సీన్ ఫ్రెమ్ టు ఫ్రెమ్ భగవంత్ కేసరిని దింపేసాడు తమిళ దర్శకుడు హెచ్ వినోద్. తెలుగులో కాజల్ నటించిన పాత్రలో పూజాహెగ్డే నటిస్తుండగా శ్రీలేల పాత్రలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు నటించింది. ఒక్క మాటలో చెప్పాలంటే భగవంత్ కేసరి ట్రైలర్ ను మరోసారి చూసినట్టుంది. ఈ నేపథ్యంలో అటు తమిళ్ ఇటు తెలుగు ఆడియెన్స్ జననాయగన్ పై ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. మరోవైపు దళపతి విజయ్ అభిమానులు మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు. మరి జనవరి 9న రిలీజ్ కాబోతున్న జననాయకుడును తెలుగు ఆడియెన్స్ ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.