Jyoti Malhotra: జ్యోతి యూట్యూబ్ ఛానల్‌లో పహల్గామ్ వీడియోలు.. డానిష్‌తో ఎన్‌క్రిప్టెడ్ సంబంధాలు!
- జ్యోతి యూట్యూబ్ ఛానల్‌లో పహల్గామ్ వీడియోలు
- డానిష్‌తో ఎన్‌క్రిప్టెడ్ సంబంధాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ద్రోహానికి పాల్పడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హాత్రాకు సంబంధించిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కస్టడీలో ఉన్న జ్యోతిని అధికారులు విచారిస్తున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. అతడితో ఉన్న సంబంధాలతో భారత రక్షణ విషయాలు పాక్‌కు చేరవేసినట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: IPL 2025: ఆందోళనలో కావ్య.. ట్రావిస్ హెడ్‌కు డేంజరస్ వైరస్
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
అయితే ఈ ఏడాదిలో రెండు సార్లు జ్యోతి పాకిస్థాన్ వెళ్లి వచ్చింది. అలాగే పలుమార్లు కాశ్మీర్‌లోని పహల్గామ్‌ను కూడా సందర్శించింది. పహల్గామ్‌లో రికార్డైన దృశ్యాలను పాకిస్థాన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్ర దాడికి కొన్ని రోజుల ముందు ఆ ప్రాంతాన్ని సందర్శించినట్లు అధికారులు కనిపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డానిష్‌తో ఉన్న సంబంధాలు నేపథ్యంలో వీడియోలను ఐఎస్ఐకి అందజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలపైనే అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఎక్కువగా డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Nara Rohit : బాబాయ్.. ఏదేమైనా నీకు తోడుగా ఉంటా.. మనోజ్ పై నారా రోహిత్..
జ్యోతి ఎవరంటే..!
జ్యోతి మల్హాత్రా(33) హర్యానాలోని హిసార్ వాసి. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన ఆరుగురు వ్యక్తుల్లో జ్యోతి ఒకరు. శనివారం ఆమెను అరెస్ట్ చేశారు. ‘‘ట్రావెల్ విత్ జో’’ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు లక్షలకు పైగా సబ్‌స్కైబర్లు, 132 వేల మంది అనుచరులు ఉన్నారు. ఈ ఏడాదిలో పలుమార్లు పాకిస్థాన్ వెళ్లివచ్చింది. పాక్‌కు సంబంధించిన వీడియోలు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. 2023లో న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో సభ్యుడైన ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్ అనే వ్యక్తిని జ్యోతి కలిసింది. డానిష్ ఆమెకు హ్యాండ్లర్‌గా మారాడు. అనంతరం పాక్ నిఘా వర్గాలను జ్యోతికి పరిచయం చేశాడు. అనంతరం ఎన్‌క్రిప్టెడ్ ఫ్లాట్‌ఫారమ్ ద్వారా ఇద్దరూ కూడా సంబంధాలు కొనసాగించినట్లుగా తెలుస్తోంది. ఇక 2023లో జ్యోతి రెండు సార్లు పాకిస్థాన్‌కు వెళ్లినట్లుగా గుర్తించారు. అక్కడ అలీ ఎహ్వాన్, షకీర్, రాణా షాబాజ్ అనే వ్యక్తులను కలిసింది. పాక్ తర్వాత ఎక్కువగా కాశ్మీర్‌లో పర్యటించినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం దర్యాప్తు లోతుగా సాగుతోంది.
తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో కనిపించిన నంబర్లతో అదృష్టం.. కూరగాయల వ్యాపారిణికి రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!