Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఉదంతం దేశరాజధానిని తీవ్రంగా కలచివేసింది. 21 మంది ప్రాణాలను బలితీసుకుని, మరో 28 మందిని ఆసుపత్రి పాలు చేసిన ఈ దారుణ ఘటనపై ఢిల్లీ పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని పట్టుకునే క్రమంలో తాజాగా శనివారం నాడు హోటల్ వంటమనిషి కేశవ్ నేగి (65)ని పోలీసులు అరెస్ట్ చేశారు. దిల్షాద్ గార్డెన్‌కు చెందిన ఈయన నిర్లక్ష్యం వల్లే ఐదు అంతస్తుల భవనం చూస్తుండగానే అగ్నిఆహుతి అయిందని ప్రాథమిక విచారణలో తేలింది. జూన్ 3న మాలవీయ నగర్‌లోని హౌజ్ రాణి ప్రాంతంలో నడుస్తున్న ‘ఫ్లోరిష్ స్టే హోటల్’లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదం వెనుక హోటల్ యాజమాన్యం చేసిన బాగోతాలు, భద్రతా లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ విస్మయానికి గురిచేస్తున్నాయి. అసలు ఈ హోటల్‌కు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు (ఫైర్ ఎన్ఓసీ) లేవని అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఉన్నవారు బయటపడటానికి ఎలాంటి మార్గాలు లేకపోవడం మరణాల సంఖ్యను పెంచింది. భవనానికి కేవలం ఒకే ఒక ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ ఉండటం, కిటికీలన్నీ శాశ్వతంగా మూసివేసి ఉంచడం, పైగా ప్రధాన ద్వారం సెన్సార్‌తో పనిచేసేది కావడం వల్ల ప్రమాదం జరగ్గానే కరెంట్ పోయి గేట్లు లాక్ అయిపోయాయి. దీంతో లోపల ఉన్నవారు ఊపిరాడక, బయటకు రాలేక అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ దారుణంలో మరణించిన 21 మందిలో పది మంది భారతీయులు కాగా, తొమ్మిది మంది ఆఫ్రికన్ దేశాలకు చెందినవారు, ఇద్దరు తుర్క్మెనిస్తాన్ పౌరులు ఉన్నారు.
హోటల్ యజమాని ఇల్లీగల్ దందాలు..
ఈ కేసుకు సంబంధించి హోటల్ యజమాని లవ్కేష్ బజాజ్‌ను పోలీసులు అంతకుముందే అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన బజాజ్ దంపతులపై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేసి, తీవ్రంగా గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. ప్రస్తుతం సాకేత్ కోర్టు ఇతడికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. బజాజ్‌పై హత్యకు సమానమైన నేరపూరిత నరహత్య, అగ్నిప్రమాదానికి కారణమవ్వడం, ఆస్తి నష్టం కలిగించడం, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద విచారణ జరుపుతున్నారు. అయితే బజాజ్ కేవలం హోటల్ నిర్వహణలోనే కాకుండా, చట్టవ్యతిరేకమైన ఇతర దందాల్లోనూ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలడం గమనార్హం. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ (అక్రమ వలసలు) కేసులో సైతం బజాజ్ హస్తం ఉన్నట్లు బయటపడింది. బంగ్లాదేశ్‌కు చెందిన స్వీటీ సర్కార్, ఆమె కుమార్తె పుష్పో సర్కార్ అనే ఇద్దరు మహిళలు భారీగా డబ్బులు ఆశజూపడంతో బజాజ్ తన చత్తర్‌పూర్ నివాస విలాసాన్ని (అడ్రస్‌ను) వాడుకోవడానికి అనుమతించాడు. ఆ అడ్రస్ ఆధారంగానే సదరు బంగ్లాదేశీయులు నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలను, పాస్‌పోర్టులను సంపాదించి ఢిల్లీలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇప్పటికే బజాజ్‌తో పాటు ఆ ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలను అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మరోవైపు.. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని భవనాల ఫైర్ సేఫ్టీ నిబంధనలు, అనధికారిక నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ ఘోర విషాదానికి కారణమైన హోటల్ యజమానులైనా, వెనకుండి నడిపించిన అధికారులైనా సరే ఎవరినీ వదిలిపెట్టేది లేదని, బాధ్యులందరిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
తాజావార్తలు
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!