AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AFG vs IND: అఫ్గానిస్థాన్‌తో న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. తొలి రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 25 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్ 37 పరుగులతో, సాయి సుదర్శన్ 32 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. యశస్వి తన సహజ శైలిలో దూకుడుగా ఆడుతూ అఫ్గాన్ బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు. 32 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన అతడు మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. మహ్మద్ సలీమ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అఫ్సర్ జజాయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే అంతకుముందు 11 పరుగుల వద్ద యశస్వికి వచ్చిన లైఫ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
Also Read
- Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన "ఇండియాస్ మావోయిస్ట్స్" పుస్తకావిష్కరణ
- Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
- CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
- AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
జైస్వాల్ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ రెండో వికెట్‌కు అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ 70 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 49 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. అయితే అఫ్గానిస్థాన్ బౌలర్ల దురదృష్టం కూడా భారత్‌కు కలిసి వచ్చింది. 11వ ఓవర్లో జియౌర్ రెహ్మాన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ బ్యాట్ ఎడ్జ్ ఇచ్చినట్లు కనిపించినా అంపైర్ ఔట్ ఇవ్వలేదు. వికెట్ కీపర్ డీఆర్ఎస్ కోరకపోవడంతో అఫ్గాన్ జట్టు మంచి అవకాశాన్ని కోల్పోయింది. తర్వాత రిప్లేల్లో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది.
అంతేకాకుండా సలీమ్ సాఫి వేసిన 16వ ఓవర్లో రాహుల్‌పై ఎల్బీడబ్ల్యూ అవకాశం వచ్చినా అఫ్గానిస్థాన్ డీఆర్ఎస్కు వెళ్లలేదు. రిప్లేల్లో బంతి వికెట్లను తాకే అవకాశం ఉన్నట్లు కనిపించింది. మరోవైపు సాయి సుదర్శన్ కూడా 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్లిప్‌లో క్యాచ్ డ్రాప్ కారణంగా లైఫ్ పొందాడు. అఫ్గానిస్థాన్ తరఫున మహ్మద్ సలీమ్ ఒక్క వికెట్ సాధించాడు. జియౌర్ రెహ్మాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు మాత్రం దక్కలేదు.
తాజావార్తలు
-
Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్” పుస్తకావిష్కరణ
-
Food Safety Raids: హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!