దేశ ద్రోహానికి పాల్పడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హాత్రాకు సంబంధించిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కస్టడీలో ఉన్న జ్యోతిని అధికారులు విచారిస్తున్నారు.
హర్యానా యూట్యూబర్, పాక్ గూఢచారి జ్యోతి మల్హాత్రా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. యూట్యూబ్ ముసుగులో ఆమె చేసిన అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. జ్యోతిని న్యాయస్థానం ఐదురోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.