మహా నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కిలోమీటర్‌కే కొన్ని గంటల సమయం పడుతుంది. ఇక బెంగళూరు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఐటీ, సాఫ్ట్‌వేర్ కంపెనీలకు నిలయం బెంగళూరు. ఎప్పుడూ ఫుల్ రష్ ఉంటుంది.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.
అన్నమయ్య జిల్లా సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. కారు కంటైనర్ లారీని ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గువ్వల చెరువు ఘాట్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా.. కారు కడప నుండి రాయచోటికి వెళ్తున్న సమయంలో కంటైనర్ ను ఢీకొట్టింది.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్లో ఇద్దరు యువకులు హైవేపై రీల్స్ చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ప్రమాదవశాత్తు వెనుక నుండి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో.. యువకులు కొన్ని సెకన్ల పాటు గాల్లోనే ఉండి కిందపడ్డారు. సినిమాలో జరిగే సన్నివేశంలా అనిపించింది. కాగా.. ఈ ఘటనలో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
కర్ణాటకలోని హవేరి జిల్లా బైడ్గి తాలూకాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును మినీ బస్సు ఢీకొనడంతో కనీసం 13 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలోని మృతులు శివమొగ్గ వాసులుగా గుర్తించారు. బెళగావి జిల్లా సవదత్తి నుంచి యల్లమ్మ దేవిని దర్శించుకుని తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మరోవైపు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని.. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు.…
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు నుజ్జునుజ్జు అయ్యారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదం సేలంలో జరిగింది. కాగా.. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
కేరళలో దారుణం జరిగింది. కన్నూర్‌లోని పున్నచ్చేరిలో అర్ధరాత్రి కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
వివాహ సంబంధాలు ప్రాణాలు తీసుకునే పరిస్థిలకు దారి తీస్తున్నాయి. వారితో పాటు వారికి పుట్టిన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని వారితో పాటే ఆ చిన్నారుల ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడటం లేదు తల్లిదండ్రులు. కుటుంబ కలహాలో.. లేక భార్య భర్తల మధ్య గొడవలు, అత్త, మామ, ఆడపడుచుల వేధింపులో.. లేక ఒకరిపై ఇంకొరి వాదనలతో వివాహేతర సంబందాలకు దూరమై ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. అయితే ఓతల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ.. పట్టాలు దాటుతుందో ఏమో తెలియదు…