Biggest Zoo: ప్రపంచంలోనే అతిపెద్ద జూ.. మన దేశంలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అతిపెద్ద జంతుప్రదర్శనశాల(జూ) మన దేశంలోనే అందుబాటులోకి రానుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మరో రెండేళ్లలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ జూని ప్రముఖ సంస్థ రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) నిర్మిస్తోంది. అహ్మదాబాద్‌కి 300 కిలోమీటర్ల దూరంగా ఉండే ద్వారకా, జామ్‌నగర్ రోడ్డులోని 280 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ వన్యప్రాణుల కేంద్రం ఏర్పాటుకానుంది. దీన్ని ‘గ్రీన్ జూలాజికల్, రెస్క్యూ అండ్ రీహ్యాబిలిటేషన్ కింగ్‌డమ్’గా పేర్కొననున్నారు.
GodFather : ఆడియో హక్కులు వారికే సొంతం..
Also Read
కరోనా నేపథ్యంలో జూ పనులు బాగా ఆలస్యమయ్యాయి. లేకపోతే ఇప్పటికే చాల వరకు పూర్తయ్యేవి. ఇకపై ఎలాంటి ఆటంకాలూ రాకపోతే అనుకున్న సమయానికే ఈ కల నెరవేరనుంది. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. రిల్ రిఫైనరీకి వెనక భాగంలో ఉన్న ప్రాంతంలో రోడ్ రోలర్లతో, పొక్లెయిన్లతో నేల చదును చేస్తున్నారు. మట్టి తవ్వకాలు చేపట్టారు. జూ ఎన్‌క్లేవ్ నుంచి 27 కిలో మీటర్ల దూరంలో సేఫ్ ఎన్‌క్లోజర్స్ రానున్నాయి. జూలోకి మొత్తం 79 జాతులకు చెందిన 16 వందల 89 జంతువులను ప్రవేశపెడతారు. ఇందులో 27 జాతులకు చెందిన 257 జంతువులు విదేశాలకు చెందినవి కావటం గమనార్హం.
ఇతర దేశాల నుంచి ఈ జీవులు ఇప్పటికే 2 కార్గో విమానాల్లో ఇండియాకి చేరుకున్నాయి. ఒకటి అహ్మదాబాద్‌లో, మరొకటి జామ్‌నగర్‌లో ల్యాండ్ అయ్యాయి. ఎయిర్‌పోర్టుల నుంచి జంతువులను యానిమల్ రెస్క్యూ సెంటర్లకు తరలించారు. న్యూట్రిషనిస్టులు, వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయా జంతువుల యోగక్షేమాలను నిత్యం పరిశీలించేందుకు ప్రత్యేక సీసీటీవీ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేశారు. జూలో 10 మేజర్ జోన్లు, 73 స్పెషలైజ్డ్ ఎన్‌క్లోజర్స్ ఉంటాయి. జూ మొత్తమ్మీద ఎగ్జోటిక్ ఐల్యాండ్ (అన్యదేశ ద్వీపం) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇండియన్ ఫారెస్ట్ జోన్‌లో 238 జంతువులు ఉంటాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?