మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ పాత్రలో కనిపిస్తుండగా.. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకు తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన మెగాస్టార్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ- సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇటీవల్ జూలై 4 న ఈ సినిమా ఫుర్సత్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక తాజాగా మరో కొత్త విషయాన్నీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఆడియో రైట్స్ ను సారేగమ చేజిక్కించుకోంది. ఇటీవల స్టార్ హీరోల సినిమాలన్నీ సారేగమ నే సొంతం చేసుకొంటుంది. ఇక మొదటిసారి చిరు సినిమా ఆడియో రైట్స్ ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని చిరు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా సాంగ్స్ తక్కువ ఉండనుండగా.. బ్యాక్ గ్రౌండ్ అద్భుతంగా ఉండనున్నదని, థమన్ ఇప్పటికే గాడ్ ఫాదర్ మ్యూజిక్ అదరగొట్టే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రంతో చిరు ‘ఆచార్య’ దెబ్బ నుంచి కోలుకుంటాడేమో చూడాలి.