Ajmer Dargah:| ఈ మధ్య కాలంలో రీల్స్ కోసం చేస్తున్న వీడియోలు కొన్ని వివాదాలకు కారణమవుతున్నాయి. అలాగే కొందరు తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూసుకోకుండా వారు చేసే పనులతో వివాదాల్లోకి నెట్టబడుతున్నారు. కొందరు కావాలని చేస్తూ వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి వైరల్ వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజ్మీర్ షరీఫ్ దర్గా ఆవరణలో ఓ మహిళ డ్యాన్స్ చేస్తున్న వీడియో వివాదం రేపుతోంది. వీడియో వైరల్ కావడంతో సదరు మహిళ ప్రార్ధనా స్ధలం పవిత్రతను కాపాడటం లేదని పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళ తీరును మసీదు నిర్వాహకులు సైతం తప్పుపట్టారు.
Read also: Bhaag Saale:‘భాగ్ సాలే’ టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ విషెష్
గ్రే, పింక్ కుర్తా దుపట్టా ధరించిన మహిళ ఇయర్‌ఫోన్స్‌లో మ్యూజిక్‌ను ఆస్వాదిస్తూ డ్యాన్స్ చేస్తుంది. అది ఎక్కడ అంటే దర్గాలో. ప్రార్ధనా స్ధలం అనే ధ్యాస కూడా లేకుండా బీట్స్‌కు అనుగుణంగా మహిళ రాజస్ధాన్‌లోని తారాఘడ్ హిల్ పాదాల చెంత కొలువైన ప్రముఖ అజ్మీర్ దర్గాలో డ్యాన్స్ చేయడం వివాదానికి కేంద్ర బిందువైంది. 13వ శతాబ్ధపు సూఫీ బోధకుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు వచ్చిన సహచర సందర్శకుడు ఈ క్లిప్‌ను రికార్డు చేసినట్టు సమాచారం. ఇది పవిత్ర ప్రదేశమని ఆ మహిళ తెలుసుకోవాలని దర్గా నిర్వాహకులు పేర్కొంటున్నారు.
Read also: Etela Rajender: హుజూరాబాద్ లో ఒక సైకో ఎమ్మెల్సీ ఉన్నాడు.. ఈటల హాట్ కామెంట్స్
దేశంలోని ప్రముఖ పవిత్ర స్ధలాల్లో ఒకటైన అజ్మీర్ దర్గాను దేశవ్యాప్తంగా వివిధ మతాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో సందర్శిస్తుంటారు. కాగా గత ఏడాది మసీదు ప్రాంగణంలో ఓ బాలిక జిమ్నాస్ట్ విన్యాసాలు కూడా వైరల్ అయ్యాయి. ఆపై బాలిక క్షమాపణలు కోరింది. ఇక గత ఏడాది అక్టోబర్‌లో ఉజ్జయినిలోని మహాకాళీ ఆలయంలో కొందరు ఇన్‌స్టాగ్రామర్లు డ్యాన్స్ వీడియోలు రికార్డు చేయడం కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామర్ల డ్యాన్స్ వీడియోలపై ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ పద్ధతిని ఖండించారు మరియు దేవాలయాల పవిత్రతను కాపాడాలని అన్నారు. పూజారులు ఈ చర్యను అసభ్యకరమైనదిగా భావించి ఫిర్యాదును ఇవ్వాలని సూచించారు. మతపరమైన ప్రదేశాలలో ఇటువంటి కార్యకలాపాలను సహించలేమని మిశ్రా అన్నారు.